Bollywood : బాలీవుడ్ ను భయపెడుతున్న బాయ్ కాట్ గండం

NQ Staff - August 14, 2022 / 03:00 PM IST

151597Bollywood : బాలీవుడ్ ను భయపెడుతున్న బాయ్ కాట్ గండం

Bollywood : ఓవైపు ప్యాండెమిక్ ఎఫెక్ట్.. మరోవైపు ఓటీటీల పోటీ చాలనట్టు కొత్తగా మరో ప్రాబ్లమ్ బాలీవుడ్ ను భయపెడుతూ ఇండస్ట్రీని ఇరుకునపెడుతోంది. అదే బాయ్ కాట్ గండం. బాలీవుడ్లో సినిమాల్ని బాయ్ కాట్ చేసే ట్రెండ్ నడుస్తోందిప్పుడు. మూవీ టీమ్ ప్రమోషన్స్ కు పోటీగా బాయ్‌ కాట్ హ్యాష్‌ ట్యాగ్‌ ప్రచారం జోరుగా సాగుతోంది.

రీసెంట్ గా అమీర్ నటించిన లాల్ సింగ్ ఛడ్డా మూవీ రిలీజ్ డే ఫస్ట్ షో నుంచే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఓపెనింగ్స్‌ కూడా మరీ దారుణంగా వచ్చాయి. దీనికి ప్రధాన కారణం బాయ్‌ కాట్ అన్న స్లోగనే అనేది బాక్సాఫీస్‌ అనలిస్టులు చెప్తోన్న మాట. హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’ కి రీమేక్ గా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే ఒరిజినల్ లో ఉన్న ఫీల్ రీమేక్ లో క్యారీ కాలేదనేది ఓ కారణమయితే.. సిక్కులను చిత్రీకరించిన తీరు బాలేదనేది మరో వాదన. మరోవైపు అమీర్ హిందూ వ్యతిరేకి అంటూ #boycottlaal singh chadda హ్యాష్ ట్యాగ్ తో రిలీజ్ కు ముందే ట్విట్టర్లో ప్రచారం సాగింది. ఈ మూవీలో ఇండియన్ ఆర్మీని కించపర్చారంటూ మరికొందరు ఈ ట్రెండ్ కు సపోర్ట్ చేశారు. తన సినిమాను బైకాట్చే యొద్దంటూ అమీర్ పబ్లిగ్గా కన్నీళ్లు పెట్టుకున్నా నిరసనకారులు శాంతించలేదు.

 Boy Cat On Vigorously in Competition with Bollywood Movie Promotions

Boy Cat On Vigorously in Competition with Bollywood Movie Promotions

అమీర్ బాలీవుడ్ ఈ బాయ్ కాట్ ట్రోల్స్ ఫేస్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్ ఏమీ కాదు. గతంలో ఇదే అమీర్ నటించిన దంగల్, సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన ‘పద్మావత్’ రిలీజ్ టైమ్ లోనూ ఇలాంటి ప్రచారం నడిచింది. కానీ ఈ రెండు సినిమాలు ఘన విజయం సాధించి బాక్సాఫీస్ దగ్గర బంపర్ హిట్ కొట్టాయి.

ఇక లేటెస్ట్ గా అక్షయ్ హీరోగా చేసిన రక్షాబంధన్ మూవీ కూడా అట్టర్ ఫ్లాప్ గానే మిగిలింది. ఈ మూవీ విడుదలకు ముందు కూడా #boycottrakshabandhanmovie హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్లో ప్రచారం సాగింది. ఈ సినిమా రచయిత్రి కనికా ధిల్లాన్ గతంలో హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో విమర్శలెదురయ్యాయి. దాంతో ఈ హ్యాష్‌ ట్యాగ్ మరింత వైరలయ్యింది. కానీ ప్రాజెక్టులో పనిచేసిన వ్యక్తుల కారణంగా సినిమాను బాయ్ కాట్ చేయొద్దంటూ అక్షయ్ కుమార్ కూడా పబ్లిక్ గానే విన్నవించుకున్నాడు. అయినా రిజల్ట్ మాత్రం నెగిటివ్ గానే తేలింది.

ఇవే కాకుండా అనురాగ్ కశ్యప్ డైరెక్షన్లో తాప్సీ నటించిన ‘దొబారా’ మూవీ కూడా ఇదే లిస్ట్ లో ఉంది. వీళ్లిద్దరి తీరు నచ్చని సంప్రదాయవాదులు ట్విట్టర్లో #canceldobaaraa హ్యాష్ ట్యాగ్ తో ట్రోలింగ్ చేస్తున్నారు. కానీ తాప్సీ, అనురాగ్ మాత్రం లైట్ తీసుకున్నారు. దీంతో ఈ మూవీ రిజల్ట్ మీద బాయ్ కాట్ ఇంపాక్ట్ ఏ మేరకు ఉంటుందో తెలియాల్సి ఉంది.

 Boy Cat On Vigorously in Competition with Bollywood Movie Promotions

Boy Cat On Vigorously in Competition with Bollywood Movie Promotions

ఇక్కడ మరీ వర్రీ అనిపించే మరో మ్యాటరేంటంటే.. థియేటర్లో రిలీజయ్యే సినిమాలకే కాదు.. ఓటీటీలకు కూడా ఈ బాయ్ కాట్ బాధ తప్పట్లేదు.
అలియా భట్ నటించిన ‘డార్లింగ్స్‌’ మూవీ ఆగస్ట్ అయిదున నెట్ ఫ్లిక్స్‌ లో రిలీజైంది. పురుషులను కించపరిచేలా మూవీ ఉందనీ, మగాళ్లపై గృహహింస అనేది బాలీవుడ్ కు ఎగతాళయి పోయిందంటూ సోషల్మీడియా వేదికగా ఫైరయ్యారు కొందరు. కానీ ఆడియెన్స్ మాత్రం అవేవీ సీరియస్ గా కన్సిడర్ చేయలేదు. దాంతో ఫస్ట్ వీకెండ్ లోనే పదిమిలియన్లకు పైగా వాచ్ అవర్స్‌ తో దూసుకుపోతోందీ మూవీ.

అఫ్ కోర్స్‌.. సినిమాలో కంటెంట్ బాగుంటే ఏ హ్యాష్‌ ట్యాగూ, ఏ నెగిటివ్ పబ్లిసిటీ మూవీ సక్సెస్ ను ఆపలేదు. నిజమే. కానీ ప్రజెంట్ సిచ్యుయేషన్లో థియేటర్‌ వరకూ రావడానికి కామన్ ఆడియెన్ ఒకటికి మూడుసార్లు ఆలోచిస్తున్నాడు. ఇలాంటి టైమ్ లో బాయ్‌ కాట్ హ్యాష్‌ ట్యాగ్స్ ట్రెండయ్యే సరికి ఓపెనింగ్స్‌ పై గట్టి ప్రభావమే పడుతోంది. మూవీ కి యావరేజ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ అండ్ సక్సెస్ ను దెబ్బతీస్తున్నాయి. ఇలా ఏరకంగా చూసుకున్నా బాయ్ కాట్ అనే థాట్ బాలీవుడ్ కి పెద్దగండంగా మారింది. మరీ హ్యాష్‌ ట్యాగ్ ప్రచారానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో,
మనోభావాల బ్యాచ్ తాలూకు ఎమోషన్స్‌ కి సినిమా బలికాకుండా మళ్లీ పూర్వపురోజులు ఎప్పుడొస్తాయో చూడాలి