Vikram Vedha : పిచ్చి పీక్స్‌కి వెళ్ళి పోయింది.! ‘విక్రమ్ వేద’ని కూడా బ్యాన్ చేసెయ్యాలి.!

NQ Staff - September 27, 2022 / 03:12 PM IST

Vikram Vedha : పిచ్చి పీక్స్‌కి వెళ్ళి పోయింది.! ‘విక్రమ్ వేద’ని కూడా బ్యాన్ చేసెయ్యాలి.!

Vikram Vedha : ఏదన్నా సినిమా వస్తోందంటే చాలు, ఆ సినిమాని బ్యాన్ చేసెయ్యాలన్న డిమాండ్లు ఈ మధ్య తరచూ చూస్తున్నాం. బాలీవుడ్ సినిమా ‘విక్రమ్ వేద’కి కూడా ఆ ఎఫెక్ట్ తాకుతోంది. దీనికి కారణమేంటి.? కేవలం బాలీవుడ్ సినిమాలకే ఎందుకీ జాడ్యం.? బాలీవుడ్ సినీ అభిమానులెందుకు సినిమాల్ని బ్యాన్ చేయాలంటున్నారు.?

సెలబ్రిటీలు మీడియాతో సరదా సంభాషణల సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో, ఇలాంటివి ఆయా సినిమాలకు మాంఛి పబ్లిసిటీ ఇచ్చేవి కూడా. కానీ, ఇప్పుడు సీన్ మారింది. ఏదన్నా సినిమా మీద ‘బ్యాన్ చేసెయ్యాలి’ అనే డిమాండ్ వచ్చిందో.. అంతే సంగతులు.. ఖేల్ ఖతం, దుకాన్ బంద్.!

‘విక్రమ్ వేద’ సినిమాని ఎందుకు బ్యాన్ చేయాలి.?

ఏమో, ఎందుకు బ్యాన్ చేయాలోగానీ, ‘బ్యాన్ విక్రమ్ వేద’ అనే హ్యాష్ ట్యాగ్ అయితే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ మధ్య ఈ తరహా నెగెటివ్ ట్రెండ్స్ కారణంగా చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫెయిల్ అయ్యాయి. ‘బ్రహ్మాస్త్ర’ కూడా ఆ నెగెటివ్ ట్రెండ్స్ కారణంగానే బలైపోయిందన్నది నిర్వివాదాంశం.

ఇక, ‘లైగర్’ సినిమాని కూడా ఈ నెగెటివ్ ట్రెండ్ దెబ్బ తీసింది. ‘సాలా క్రాస్ బ్రీడ్’ అంటూ విజయ్ దేవరకొండ చేసిన అతి కాస్తా, ఈ సినిమాపై నెగెటివ్ ట్రెండ్‌కి కారణం. సినిమాని నిజంగానే బాలీవుడ్ సినీ అభిమానులు బ్యాన్ చేసేశారు. తెలుగునాట కూడా అదే పరిస్థితి.

‘విక్రమ్ వేద’ మీద నెగెటివ్ ఇంపాక్ట్ ఎంత పడుతుందో ఇప్పుడు చెప్పలేం. కానీ, ఖచ్చితంగా ఆ ప్రభావమైతే వుంటుంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us