Bollywood : టాలీవుడ్‌కి దిగి రానున్న బాలీవుడ్.!
NQ Staff - August 18, 2022 / 10:44 PM IST

Bollywood : ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పించిన సంగతి తెలిసిందే. బ్యాడ్ లక్ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. గతంలో ‘బాహుబలి’ సినిమాని బాలీవుడ్‌లో కరణ్ జోహార్ సమర్పించాడు. ఇప్పుడు ‘లైగర్’ సినిమాని కూడా కరణ్ జోహారే భుజాల మీద వేసుకున్నారు బాలీవుడ్ వరకూ.

Bollywood and tollywood update
అసలు విషయమేంటంటే, బాలీవుడ్ పరిస్థితి ఏమంత బాగోలేదు ప్రస్తుతం. ఏం చేసినా సరే, నిలదొక్కుకోలేకపోతోంది బాలీవుడ్ సినిమా. దాంతో ఏం చేయాలో తోచని దుస్థితిలో వుంది బాలీవుడ్. దాంతో ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారట బాలీవుడ్ వర్గాలు.
తెలుగు సినిమానా మజాకానా.!
తాత్కాలికంగా టాలీవుడ్‌లో పెట్టుబడులు పెట్టాలని డిసైడ్ అయ్యారట. ‘కేజీఎఫ్’ సినిమాతో అంతవరకూ అస్సలు లెక్కల్లోనే లేని కన్నడ సినిమా కూడా పుంజుకుంది. కన్నడ సినిమాపైనా యావత్ సినీ ప్రపంచం దృష్టి పెట్టింది. అయితే, ‘కేజీఎఫ్’ తో వచ్చిన గుర్తింపు ‘విక్రాంత్ రోణ’తో పోగొట్టుకుంది కన్నడ పరిశ్రమ.
దాంతో ఇప్పుడు తెలుగు సినిమా పైనే అందరి దృష్టి. ‘బాహుబలి’తో ఆగిపోలేదు, ‘ఆర్ఆర్ఆర్’తో మళ్లీ మొదలైన తెలుగు సినిమా వైభవం, ఇటీవల రిలీజైన ‘బింబిసార’, ‘సీతారామం’, ‘కార్తికేయ 2’ తదితర సినిమాలతో కొనసాగుతూనే వుంది. సో, బాలీవుడ్ నిర్మాతలంతా తెలుగు సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారట.
బాలీవుడ్‌లో రీసెంట్‌గా వచ్చిన ‘లాల్ సింగ్ చద్దా’ ఫలితం బాలీవుడ్‌ని మరింత నిరాశకు గురి చేసింది. దాంతో, బాలీవుడ్ నిర్మాతలు ఇలాంటి షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు బాలీవుడ్ సమాచారం.