Nitin : నిఖిల్‌ని పిలవాలనుకుని నితిన్‌తో భేటీ అయిన బీజేపీ.?
NQ Staff - September 6, 2022 / 11:05 PM IST

Nitin : ఇదేం ట్విస్టురా నాయనా.? ఔను, ప్రచారంలో వున్న గాసిప్ నిజమైతే.. ఇది నిజంగానే ఎవరూ ఊహించని ట్విస్ట్.! కాదు, కాదు, ఇంత పెద్ద పొరపాటు.. బహుశా రాజకీయాల్లో ఇంతకు ముందెన్నడూ జరిగి వుండదేమో.! కానీ, అలా ఎలా సాధ్యం.?

BJP met with Nitin call Nikhil
సినీ నటుడు నితిన్ ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయిన విషయం విదితమే. యంగ్ టైగర్ ఎన్టీయార్‌ని ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విషయమై అభినందించడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆ ఎన్టీయార్‌తో భేటీ అయ్యారు.
నిఖిల్‌తో భేటీ అవ్వాలనుకుని.. నితిన్‌తో సరిపెట్టి..
మరి, నితిన్‌ని ఏ కోణంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కలిసినట్లు.? అంటే, పొరపాటు జరిగిందని.. అసలు కథ వేరే వుందని అంటున్నారు. జేపీ నడ్డా అసలు కలవాలనుకున్నది యంగ్ హీరో నిఖిల్‌ని అట. అది కూడా, ‘కార్తికేయ-2’ సినిమా విషయమై అభినందన తెలపడానికట.
ఎక్కడో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల నిఖిల్ స్థానంలోకి నితిన్ వచ్చాడన్నది తాజాగా జరుగుతున్న ప్రచారం తాలూకు సారాంశం. అలా ఎలా జరుగుతుంది.? మరీ, ఇంత పెద్ద పొరపాటు చేస్తారా.? ఏమో, రాజకీయాల్లో ఇలాంటి పొరపాట్లు అరుదుగానే జరుగుతుంటాయ్.! అనుకోవాల్సిందే.
అన్నట్టు, నితిన్ లాగానే నిఖిల్ కూడా పవన్ కళ్యాణ్ అభిమాని.. పైగా, రాజకీయాలపై నితిన్ కంటే నిఖిల్ ఎక్కువగా స్పందిస్తుంటాడు.