Bindhu Madhavi : ఇన్నాళ్లు బుల్లితెరపై సందడి చేసిన బిగ్ బాస్ షో ఇప్పుడు నాన్‌స్టాప్ పేరుతో ఓటీటీలో వినోదం అందించింది. ప్రతి సంవత్సరం టెలివిజన్‌లో ప్రసారమయ్యే ‘బిగ్‌బాస్’ సీజన్‌కు భిన్నంగా కేవలం ఓటీటీ వేదికగా ‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’ను ప్రారంభించారు. 24/7 అంటూ డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా ఫిబ్రవరి 27న ‘బిగ్ బాస్ నాన్‌స్టాప్’ మొదలైంది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణా స్టూడియోస్‌లో వేసిన ప్రత్యేక సెట్‌లో ‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’ సీజన్ 84 రోజుల పాటు నడిచింది.
మొత్తం 18మంది కంటెస్టెంట్‌లు ఇందులో పాల్గొన్నారు. ఇందులో కొత్త వారితో పాటు, గతంలో టెలివిజన్‌లో ప్రసారమైన ‘బిగ్‌బాస్’ సీజన్‌లలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన వారు కూడా ఈసారి పోటీ పడ్డారు. అజయ్‌కుమార్, అఖిల్ సార్థక్, బిందు మాధవి, హమీదా, మహేశ్ విట్టా, ముమైత్‌ఖాన్, తేజస్విని మదివాడ, శ్రీ రాపాక, అరియానా, శివ, స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతు, అనిల్ రాథోడ్, మిత్ర శర్మ, బాబా భాస్కర్, నటరాజ్‌మాస్టర్, అషురెడ్డి, సరయు షోలో పాల్గొన్నారు.
అయితే ఎప్పుడు లేని విధంగా బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఆడపులి విజయం సాధించి చరిత్ర సృష్టించింది. బిగ్ నాన్ స్టాప్ విజేతగా అవతరించిన బిందు మాధవి .. కొత్త చరిత్రకు నాంది పలికింది. బిగ్ బాస్ తెలుగు చరిత్రలో విజేతగా నిలిచిన తొలి మహిళగా హిస్టరీ క్రియేట్ చేసింది. తన మాటే బలహీతన అని భయపడిన బిందు.. అదే మాటతీరుతో ఆకట్టుకుంది. తన బలహీనతనే బిగ్ బాస్ హౌస్‌లో బలంగా మార్చుకుంది.
బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జున టైటిల్ విన్నర్‌గా బిందు మాధవిని ప్రకటించాక.. ఆమె కాస్త భావోద్వేగానికి గురయ్యారు. తనను ఆదరించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. తన విజయాన్ని లేట్ బ్లూమర్స్ (ఆలస్యంగా సక్సెస్ అయ్యేవారు)కి అంకితం ఇస్తున్నట్లు చెప్పారు. సక్సెస్ కొంతమందికి త్వరగా వస్తుందని… కొంతమందికి కొన్నేళ్లు పడుతుందని…. చాలా ఏళ్ల కష్టం తర్వాత బిగ్‌బాస్ ట్రోఫీ రూపంలో తనకు సక్సెస్ వచ్చిందని పేర్కొన్నారు.
- Advertisement -

ఏదైనా ఒక ప్రొఫెషన్‌లో చాలా కాలం పాటు ప్రయత్నిస్తూ ఉంటే… చాలామంది నమ్మకం వదిలేసుకుంటారని బిందు మాధవి పేర్కొన్నారు. ఇంకా ఎన్నాళ్లిలా.. వదిలేసి వేరే జాబ్ చూసుకోండనే ఒత్తిళ్లు పెరుగుతాయన్నారు. తన విషయంలో నమ్మకమే తనను ఇక్కడి దాకా నడిపించిందన్నారు. లేట్ బ్లూమర్స్ ఏ రంగంలో ఉన్నా.. హోప్ వదిలిపెట్టుకోవద్దని అన్నారు.
గతంలో తమిళంలోనూ బిగ్‌బాస్ కంటెస్టెంట్ అయిన బిందు మాధవి.. ఆ అనుభవాన్ని ఇక్కడ ఉపయోగించుకుంది. టాస్క్‌లు, గేమ్స్‌ను జాగ్రత్తగా డీల్ చేసింది. పలుమార్లు ఎలిమినేషన్‌కి నామినేట్ అయినా… ఆ ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఓట్ల విషయంలో మిగతా కంటెస్టెంట్స్ కన్నా బిందు చాలా ముందు వరుసలో ఉంది.
అఖిల్‌ని ఆడ అని అనడం.. నటరాజ్ మాస్టర్‌ని రా అని అనడం.. మైక్‌ని నేలకేసి కొట్టడం.. తినే కంచాన్ని పక్కకి తోసేయడం లాంటివి ఆమె చేసిన మిస్టేక్సే అయినా.. వాటిని డిఫెండ్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యింది. మాటకి మాటే కాదు.. పోట్లాటకి కూడా సిద్ధమే అన్నట్టుగా ఎటాకింగ్ గేమ్ ఆడి.. కండబలంతో కాకుండా బుద్దిబలంతో బిగ్ బాస్ గేమ్ ఆడి టైటిల్‌ని సొంతం చేసుకుంది బిందు మాధవి. టైటిల్ గెలిచిన తరువాత కూడా ఆమె విన్నింగ్ స్పీచ్‌లో కూడా మెచ్యురిటీ చూపించింది బిందు.