Bimbisara : నందమూరి కళ్యాణ్ రామ్ నటించి, నిర్మించిన ‘బింబిసార’ సినిమా కొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. సంయుక్త మీనన్, కేథరీన్ ట్రెసా ఈ సినిమాలో కథానాయికలు.

కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందింది. కళ్ళు చెదిరే విజువల్స్, దానికి తోడు టైమ్ ట్రావెల్ నేపథ్యం.. వెరసి ‘బింబిసార’ సినిమాపై భారీ అంచనాలున్నాయ. కాగా, ‘బింబిసార’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి యంగ్ టైగర్ ఎన్టీయార్ తనదైన ‘పవర్’ అద్దారు.
సినిమాని మళ్ళీ చూసిన యంగ్ టైగర్..
‘బింబిసార’ సినిమాని తాను చూసేశానని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీయార్ చెప్పిన విషయం విదితమే. కథ విన్నప్పుడే ఆశ్చర్యపోయాననీ, సినిమా తెరపై చూశాక మరింత ఆశ్చర్యం కలిగిందనీ, ‘బింబిసార’ పాత్రకు కళ్యాణ్ రామ్ తప్ప ఇంకెవరూ న్యాయం చేయలేరని ఎన్టీయార్ చెప్పుకొచ్చాడు.
తాజాగా యంగ్ టైగర్ ఎన్టీయార్ తన సతీమణి ప్రణతితో కలిసి ‘బింబిసార’ సినిమా చూశాడు. ప్రసాద్ ల్యాబ్స్‌లో వేసిన స్పెషల్ షోని ఎన్టీయార్, ప్రణతి ప్రత్యేకంగా వీక్షించి, ఎంజాయ్ చేశారు.