Bimbisara And Sita Ramam Movies : ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.? అంటూ సినీ జనాలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నట్లే కనిపిస్తోంది. నేడు రెండు తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో ఒకటి ‘బింబిసార’ కాగా, ఇంకోటి ‘సీతారామం’. రెండింటిపైనా విడుదలకు ముందు భారీ అంచనాలే వున్నాయి.
ఒకటేమో మాస్ సినిమా, ఇంకోటేమో క్లాస్ సినిమా.. రెండింటికీ ఇద్దరు అగ్ర హీరోల ఆశీస్సులు లభించాయి. ‘బింబిసార’ సినిమాకి యంగ్ టైగర్ ఎన్టీయార్ అండగా నిలిస్తే, ‘సీతారామం’ సినిమాకి ప్రభాస్ పవర్ తోడైంది.!
సినిమాల రిజల్ట్ ఎలా వుంది.?

‘బింబిసార’కీ, ‘సీతారామం’ సినిమాకీ.. నెగెటివ్ టాక్ అయితే కనిపించడంలేదు. కొంత మిక్స్‌డ్ టాక్ ఈ రెండు చిత్రాలకూ వినిపిస్తోంది. అది కూడా ఓ మోస్తరు పాజిటివ్ యాంగిల్‌లోనే. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఫర్వాలేదనిపించేలానే వుండడం గమనార్హం.
చాలాకాలం తర్వాత థియేటర్ల వద్ద పండగ వాతావరణం కనిపించింది. మార్నింగ్ షో నుంచి మొదలైన హంగామా, మ్యాటినీకీ కొనసాగింది.. రెండో రోజూ, మూడో రోజూ ఈ రెండు సినిమాలకీ జనం బాగానే రావొచ్చన్నది ట్రేడ్ పండితుల తాజా అంచనా.
మొత్తమ్మీద, థియేటర్లకు మళ్ళీ జనం వస్తున్నారన్న ఆనందమైతే సినీ పరిశ్రమలో కనిపిస్తోంది. రేపటికి పూర్తిస్థాయిలో ఓ క్లారిటీ వస్తుంది.. ఈ రెండు సినిమాల రిజల్ట్‌కి సంబంధించి.