Nagarjuna : ఆదిరెడ్డి ఓవర్ థింకింగ్ పై నాగార్జున సీరియస్ కామెంట్స్

NQ Staff - November 20, 2022 / 12:15 PM IST

Nagarjuna : ఆదిరెడ్డి ఓవర్ థింకింగ్ పై నాగార్జున సీరియస్ కామెంట్స్

Nagarjuna : తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 ముగింపు దశకు చేరుకుంది. తాజా వీకెండ్‌ ఎపిసోడ్‌ లో ఆదిరెడ్డి తీరుపై నాగార్జున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆదిరెడ్డి ఆట ఆడకుండా తనకు ఈ గేమ్ నచ్చలేదు అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

మరీ ఇలాంటి చీప్ ఆట తీరు ఏంటీ అంటూ ఆదిరెడ్డి ని నాగార్జున తీవ్రంగా విమర్శించాడు. ఇదే సమయంలో ఆది రెడ్డి యొక్క ఓవర్ థింకింగ్ ను గురించి కూడా నాగార్జున ప్రశ్నించాడు. ఇంతకు ముందు ఒక టాస్క్ ను ఇచ్చిన సమయంలో గీతూ ఎక్కువగా ఆలోచించేది… కానీ ఇప్పుడు ఆమె స్థానంలో నువ్వు అలా ప్రవర్థిస్తున్నావు అంటూ విమర్శించాడు.

తెలుగు బిగ్‌ బాస్ సీజన్ 6 యొక్క కంటెస్టెంట్స్ విషయంలో ఇప్పటికే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో కంటెస్టెంట్స్ ఆట ఆడకుండా ఓవర్‌ థింక్ చేస్తూ ఆడకుండా ఉండటం విడ్డూరం అన్నట్లుగా కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. అందుకే ఈ విషయంలో నాగార్జున కాస్త ఎక్కువగానే సీరియస్ అయ్యాడనే వార్తలు వస్తున్నాయి.

బిగ్‌ బాస్ నుండి ఈ వారం మెరీనా ఎలిమినేట్ అయ్యింది. ఆమె ఇప్పటికే ఎలిమినేట్‌ అవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల సేవ్‌ అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఎలిమినేట్ అవ్వడంతో కొందరు బిగ్‌ బాస్‌ ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us