BiggBoss : మరీ ఇంత పిసినారితనమా.? ఇది బిగ్ బాస్ మార్కు కోత.!

NQ Staff - September 2, 2022 / 11:01 PM IST

156395BiggBoss : మరీ ఇంత పిసినారితనమా.? ఇది బిగ్ బాస్ మార్కు కోత.!

BiggBoss : సెప్టెంబర్ 4న బిగ్‌బాస్ ఆరో సీజన్ స్టార్ట్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్‌కి కూడా హోస్ట్‌గా నాగార్జునే వ్యవహరించనున్నారు. కాగా, ఈ సారి బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ లిస్టులో పెద్దగా లీకులు రాలేదనే చెప్పాలి. బిగ్‌బాస్ సీజన్ స్టార్ట్ అవుతుందనగా, నెల రోజుల ముందే కంటెస్టెంట్ల పేర్లు సోషల్ మీడియాలో హ‌ల్‌చల్ చేసేవి. కానీ, ఈ సారి అలా జరగకపోవడం విచిత్రమే.

BiggBoss Telugu cost cutting

BiggBoss Telugu cost cutting

అందుకూ ఓ కారణం వుంది.

ప్రతీ సీజిన్‌లోనూ బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు అడిగినంత రెమ్యనరేషన్ ఇచ్చి తీసుకొచ్చేవారు. కానీ, ఈ సారి బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు జీతాలు అదేనండీ రెమ్యునరేషన్లు బాగా తగ్గించేశారట. దాంతో పాపులర్ సెలబ్రిటీలు అస్సలు ఈ షో వైపు కన్నెత్తయినా చూడలేదని తెలుస్తోంది.

బిగ్‌బాస్ ఆరో సీజన్‌లో 19 మంది కంటెస్టెంట్లు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మొదట 16 మంది ఎంట్రీ ఇవ్వగా, మరో ముగ్గురు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇస్తారట. కంటెస్టెంట్లలో ఎవరో ఇద్దరు ముగ్గురు తప్ప మిగిలిన వారెవ్వరూ బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయస్థులు కారనీ మాట్లాడుకుంటున్నారు.

కొత్త వాళ్లే అయినా, కొన్నికేటగిరిలుగా విభజించి, ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రం ఫుల్‌గా వుండేలా ముందే డిజైన్ చేశారట. సో, ఈ సారి బిగ్‌బాస్ ఎంటర్‌టైన్‌మెంట్ కా బాస్ అనేలా వుండోబోతుందని అంటున్నారు. ఇక కొత్త వాళ్ల సంగతంటారా.? ఒకటి, రెండు వారాలు చూస్తే అదే అలవాటైపోతారు. ఆడియన్స్‌కి కావాల్సింది ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్. అంతేగా అంతేగా బిగ్‌బాస్.!