Lahari : అక్కినేని హీరోల‌తో బిగ్ బాస్ బ్యూటీ ప్ర‌యాణం.. క‌ల నెర‌వేరిందంటూ కామెంట్

Lahari : బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్య‌క్ర‌మంలో 19 మంది కంటెస్టెంట్స్ పాల్గొన‌గా, అందులో కొంద‌రు కంటెస్టెంట్స్ త‌మ అంద‌చందాల‌తో ఆక‌ట్టుకున్నారు. వారిలో ల‌హ‌రి ఒక‌రు. ఈ అమ్మ‌డు ఊహించ‌ని విధంగా త్వ‌ర‌గానే బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఉన్న కొన్ని రోజులు అయిన ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించిన ఈ ముద్దుగుమ్మ ప్ర‌స్తుతం వ‌రుస సినిమా ఆఫ‌ర్స్ అందిపుచ్చుకుంటుంది. అయితే ఈమె బంగార్రాజు ప్రమోషన్ లో భాగస్వామ్యం కావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది..

BiggBoss telugu 5 Lahari very happy with bangarraju team travel
BiggBoss telugu 5 Lahari very happy with bangarraju team travel

బంగార్రాజు ప్రమోషన్ లో భాగంగా నాగ చైతన్య.. నాగార్జున మరియు కృతి శెట్టిలు ప్రైవేట్ జెట్ లో ప్రయాణించినట్లుగా అధికారికంగా బయటకు వచ్చింది. అయితే వారు ఎక్కడకు ప్రయాణించారు.. ఎలా వారి ఈవెంట్స్ జరిగాయి అనే విషయాలను చూపించలేదు. ఈ సమయంలో లహరి తన సోషల్ మీడియా అకౌంట్ లో కల నెరవేరింది.

BiggBoss telugu 5 Lahari very happy with bangarraju team travel
BiggBoss telugu 5 Lahari very happy with bangarraju team travel`

నాగార్జున సర్ తో రోజంతా ప్రైవేట్ జెట్ లో ప్రయాణించే అవకాశం రావడం అదృష్టం అన్నట్లుగా ఫొటోను షేర్ చేసింది. 7 జనవరి 2021 లో తన కల నెరవేరిందని లహరి పేర్కొంది. అదే రోజున బంగార్రాజు టీమ్ మొత్తం కూడా ప్రైవేట్ జెట్ లో ప్రయాణం చేశారు. వారి ప్రయాణం ఎటు జరిగింది.. వారి ప్రయాణంలో లహరి ఎందుకు తోడు అయ్యింది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

లహరి సినిమాలో కీలక పాత్ర ఏమైనా పోషించిందా అంటే అదేం లేదని సమాచారం. బిగ్ బాస్ 5 తో వచ్చిన గుర్తింపును సద్వినియోగం చేసుకునేందుకు లహరి ప్రయత్నాలు చేస్తుంది. హోస్ట్ యాంకర్ గా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న లహరికి బంగార్రాజు టీమ్ ఆ అవకాశం కల్పించినట్లుగా తెలుస్తోంది.

ఒక వేళ బంగార్రాజు సినిమా ప్రమోషన్స్ ఆకట్టుకునే విధంగా ఉంటే ఖచ్చితంగా ముందు ముందు లహరి ఖచ్చితంగా మంచి పేరును దక్కించుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ఇక బంగార్రాజు సినిమా విషయానికి వస్తే నాగార్జున మరియు నాగ చైతన్యలు తాత మనవడిగా కనిపించబోతున్నారు.