Avinash : బిగ్ బాస్ సిక్స్: అవినాష్.. ఔను, ఒక్కడే.!

NQ Staff - December 19, 2022 / 11:46 AM IST

Avinash : బిగ్ బాస్ సిక్స్: అవినాష్.. ఔను, ఒక్కడే.!

Avinash :  జబర్దస్త్ అవినాష్ అలియాస్ ముక్కు అవినాష్.. ఔను, అతనొక్కడే.! బిగ్ బాస్ రియాల్టీ షో ఆరో సీజన్ మొత్తానికీ చెప్పుకోదగ్గ ఇంట్రెస్టింగ్ విషయం ఇప్పటిదాకా ఏదైనా వుంటే అది అవినాష్ కాస్సేపు బిగ్ బాస్‌లో ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ మాత్రమేనేమో.!

బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఆరో సీజన్ ముగింపుకి వచ్చేసింది. టైటిల్ వేటలో చివరికి ఐదుగురు మిగిలారు. నిన్నటి ఎపిసోడ్‌లో పాత కంటెస్టెంట్లు హౌస్‌లోకి వచ్చి సందడి చేశారు. అంతా రొట్ట బ్యాచ్.. అని బిగ్ బాస్ వీక్షకులు తేల్చేశారు.. ఒక్క అవినాష్‌కి మాత్రమే ఫుల్ మార్క్స్ వేశారు.

భాను, తేజస్వి.. అంతా హుళక్కే..

భానుశ్రీ వచ్చింది.. తేజు వచ్చింది.. ఆర్జే కాజల్ కూడా వచ్చింది. రవికృష్ణ, మెహబూబ్ తదితరులూ హౌస్‌లోకి వచ్చారు. అరియానా కూడా అవినాష్‌తో కలిసి వచ్చింది. అయినాగానీ, వన్ అండ్ ఓన్లీ అవినాష్.!
అవినాష్, అరియానా కలిసి ఓ సీజన్‌లో కంటెస్టెంట్లుగా సందడి చేసిన విషయం విదితమే. అప్పట్లో ఈ ఇద్దరి మధ్యా ట్రాక్ బాగా పడింది. ఆ సీజన్ మొత్తానికీ అన్నీ తానే అయి వ్యవహరించాడు అవినాష్. మళ్ళీ ఇప్పుడు.. జస్ట్ గెస్ట్ అప్పీయరెన్స్‌తో అదరహో అనిపించేశాడు.
అన్నట్టు, బిగ్ బాస్ కంటెస్టెంట్ల మద్దతుదారులు.. ‘ఇక చాలు’ అనేలా ఈ సీజన్ ముగిసిపోతోంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us