Nandini Rai : చీర‌క‌ట్టులో స‌రికొత్త లుక్‌లో క‌నిపిస్తూ కాక రేపుతున్న బిగ్ బాస్ భామ‌

Nandini Rai : అందం, అభిన‌యం ఉన్న ముద్దుగుమ్మ‌ల‌కి అవ‌కాశాలు చాలా త‌క్కువగా రావ‌డం దుర‌దృష్టం.ఇప్ప‌టికే చాలా మంది ముద్దుగమ్మ‌లు అవ‌కాశాల కోసం క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూస్తుంటారు. అలాంటి వారిలో నందిని రాయ్ ఒక‌రు. అందం ఉండి.. అద్భుతంగా యాక్టింగ్ చేయగల నైపుణ్యం ఉన్నా ఈమెకు లక్ మాత్రం అంతగా కలిసి రాలేదు. అందుకే పెద్దగా ఆఫర్లను అందుకోలేకపోతోంది. దీంతో టాలెంట్ ఉన్నా అవకాశాలను అంతగా రప్పించుకోలేపోతోంది.

BiggBoss buty Nandini Rai saree photos
BiggBoss buty Nandini Rai saree photos

చిన్న వయసులోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది హైదరాబాదీ అమ్మాయి నందినీ రాయ్. అందులోకి వెళ్లిన చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును అందుకుంది. పేరుకు హైదరాబాద్ అమ్మాయే అయినా.. నందినీ రాయ్ ఉత్తరాదిలో ఫేమస్ అయింది. దీంతో బాలీవుడ్‌లోనే మొదటి అవకాశం అందుకుంది. ఈ క్రమంలోనే ‘ఫ్యామిలీ ప్యాక్’ అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది.

BiggBoss buty Nandini Rai saree photos
BiggBoss buty Nandini Rai saree photos

ఆ తర్వాత ‘మాయ’ అనే సినిమాతో టాలీవుడ్‌లోకి వచ్చింది. ఈ క్రమంలోనే ‘మోసగాళ్లకు మోసగాడు’, ‘సిల్లీ ఫెలోస్’ వంటి మూవీల్లో నటించింది. చాలా భాషల్లో సినిమాలు చేసినా నందినీ రాయ్‌కు పెద్దగా గుర్తింపు దక్కలేదు. కానీ, బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె కెరీర్‌కు ఒక్కసారిగా ఊపొచ్చింది.

BiggBoss buty Nandini Rai saree photos
BiggBoss buty Nandini Rai saree photos

నందినీ రాయ్ తెలుగులో కంటే మిగిలిన భాషల్లోనే చాలా సినిమాలు చేసింది. ఇక, ఇప్పుడు మాత్రం ఆమెకు అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో ఎలాంటి ఆఫర్లు వచ్చినా ఒప్పుకుంటోంది. ఇందులో భాగంగానే ఇటీవలే ‘కోతి కొమ్మచ్చి’ అనే సినిమా కోసం ఐటమ్ సాంగ్ చేసింది. అలాగే ‘ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్’ వెబ్ సిరీస్‌లో బోల్డు రోల్‌లో కనిపించి అందరికీ షాకిచ్చింది.

BiggBoss buty Nandini Rai saree photos
BiggBoss buty Nandini Rai saree photos

సినిమాలు ఉన్న లేకపోయినా.. నందినీ రాయ్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే తనకు, తన వృత్తికి సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ హల్‌చల్ చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చీర‌క‌ట్టులో హాట్ షో చేస్తూ కేక పెట్టిస్తుంది. నందినీ రాయ్ క్యూట్ లుక్స్‌కి అంతా ఫిదా అవుతున్నారు.