BiggBoss 5 : బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌పై ఆగ‌ని ట్రోలింగ్‌.. అలా చేయోద్దంటూ వేడుకున్న అనీ మాస్ట‌ర్

BiggBoss 5 : బుల్లి తెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా అల‌రించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. దాదాపు ఐదేళ్లుగా సందడి చేయడంతో పాటు దేశ వ్యాప్తంగా హవాను చూపిస్తూ దూసుకుపోతోంది. ఏ భాషలోనూ దక్కనంత స్పందనను అందుకుంటూ భారీ టీఆర్పీని రాబడుతోంది. ఫలితంగా ఇది తెలుగులో ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది.

BiggBoss 5 trolls on anee master
BiggBoss 5 trolls on anee master

బిగ్ బాస్ షో ముగిసినా కూడా కంటెస్టెంట్లు మాత్రం నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతూనే ఉంటారు. కొంద‌రు అభిమానులు తిడుతూ పోస్ట్‌లు పెడుతుండ‌గా, మ‌రికొంద‌రు విమ‌ర్శ‌లు కురిపిస్తూ చ‌ర్చనీయాంశంగా మారుస్తున్నారు. అయితే సంక్రాంతి ఈవెంట్ కోసం స్టార్ మా ఓ ప్రోగ్రాం చేస్తోంది. ఇందులో బిగ్ బాస్ కంటెస్టెంట్లు పాల్గొంటారన్నది అందరికీ తెలిసిందే.

ఈక్రమంలో సన్నీ, మానస్ ఇద్దరూ కూడా ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు స్టెప్పులు వేశారు. దీంతో సన్నీ మానస్ అభిమానులు తెగ సందడి చేస్తూ వచ్చారు. మానస్, సన్నీలను కలిసి మన్‌సూన్ అంటూ ఓ కొత్త హ్యాష్ ట్యాగ్‌తో దుమ్ములేపుతున్నారు. వీటిపై శ్రీరామచంద్ర ఫ్యాన్స్ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. ఆ ట్రోలింగ్ మీద మానస్, సన్నీ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు.

ఎవరినీ ఇలా పర్సనల్‌గా తిట్టొద్దని, ట్రోలింగ్ వద్దని అంటారు.. మళ్లీ ఇలా మీరే స్టార్ట్ చేస్తారు.. మేం ట్రోల్ స్టార్ట్ చేస్తే మా మీద పడి ఏడుస్తారు అంటూ మానస్ సన్నీ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. దీంతో ఆనీ మాస్టర్ రంగంలోకి దిగింది. ప్లీజ్ దయచేసి ఇలాంటి ట్రోలింగ్‌ను ఆపండి.

నేను ఎప్పుడూ కూడా ఇలాంటి ట్రోలింగ్‌ను ఎంకరేజ్ చేయను.. నా మీద గానీ ఇతర కంటెస్టెంట్ల మీద గానీ ఇలాంటి ట్రోల్స్ చేయకండంటూ ఆనీ మాస్టర్ వేడుకుంది. మరి ఈ ట్రోలింగ్ అనేది ఆపడం ఎవరి తరమైనా అవుతుందా? ఆనీ మాస్టర్ చెప్పినంత మాత్రానా? అభిమానులు హద్దుల్లో ఉంటారా? అన్నది చూడాలి.