Bigg Boss Will Give Twist Pallavi Prashanth : పల్లవి ప్రశాంత్ విషయంలో భారీ ట్విస్ట్ ఇవ్వనున్న బిగ్ బాస్.. మరో కంటెస్టెంట్ ఎంట్రీ..!
NQ Staff - September 15, 2023 / 12:08 PM IST

Bigg Boss Will Give Twist Pallavi Prashanth :
బిగ్ బాస్-7 సీజన్ గత సీజన్లతో పోలిస్తే కాస్త బెటర్ గానే అనిపిస్తుంది. కొన్ని టాస్కులు, వెంటనే బిగ్ బాస్ ఇన్వాల్వ్ అయిపోయి గేమ్ ఛేంజ్ చేయడం లాంటి ట్విస్టులు బాగానే కలిసివస్తున్నాయి. ఇక రెండో వారంలో ఇప్పటికే మాయాస్త్ర పేరుతో కంటెస్టెంట్ల మధ్య చిచ్చు పెట్టాడు బిగ్ బాస్. దాంతో ఇప్పుడు ఓటింగ్ లో భారీ మార్పులు వస్తున్నాయి. రెండో వారం నామినేషన్స్ లో ఎక్కువ మంది ఉన్నారు. ఈ సారి 9 మంది ఉండగా.. అందులో అందరికంటే ఎక్కువగా నామినేట్ చేసిన వ్యక్తిగా పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. పల్లవి ప్రశాంత్ విషయంలో బిగ్ బాస్ కూడా బాగానే ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రశాంత్ ను వినియోగించుకుని భారీగా వ్యూస్, రేటింగ్స్ సాధించాలన్నది బిగ్ బాస్ ప్లాన్ అని తెలుస్తోంది. అందుకే అతన్ని అందరితో టార్గెట్ చేయించాడనే ఆరోపణలు వస్తున్నాయి. పల్లవి ప్రశాంత్ ను ఇలా టార్గెట్ చేయించడం వల్ల ఆయనపై సింపతీ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బిగ్ బాస్ గురించి చర్చ జరిగేలా చేస్తోంది. ఇదంతా బాగానే వర్కౌట్ అయింది కాబట్టి ఇప్పుడు పల్లవి ప్రశాంత్ విషయంలో మరో భారీ ట్విస్ట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అదేంటంటే.. బిగ్ బాస్ సీజన్-3లో రాహుల్ సిప్లిగంజ్ ను ఎలిమినేట్ చేసినట్టే చేసి సీక్రెట్ రూమ్ కు పంపించారు. తర్వాత ఆయన్ను రీ ఎంట్రీ ఇప్పించారు.
ఇప్పుడు ప్రశాంత్ విషయంలో కూడా అదే చేయాలని చూస్తున్నారంట. ఈ మేరకు సోషల్ మీడియాలో లీకులు కూడా ఇస్తున్నారు. ఈ వారంలో హౌస్ నుంచి ఇద్దరిని ఎలిమినేట్ చేస్తారని తెలుస్తోంది. అందులో పల్లవి ప్రశాంత్ కూడా ఉంటాడంట. ఆ తర్వాత అతన్ని సీక్రెట్ రూమ్ కు పంపిస్తారని తెలుస్తోంది. ఇది ఎంత వరకు నిజమవుతుందనేది ఈ వీకెండ్ ఎపిసోడ్లలో తేలనుంది. ఒకవేళ సీక్రెట్ రూమ్‍కు పంపితే పల్లవి ప్రశాంత్‍కు స్క్రీన్ టైమ్ పెరిగి.. అతడికి మరింత ఆదరణ పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అదే జరిగితే ఈ సీజన్ లో ఆయనే విన్నర్ అయ్యే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి.
ఎందుకంటే ఈ రెండు వారాల నామినేషన్స్ లో పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. పైగా రెండు వారాల్లో కూడా అందరికంటే ఎక్కువ ఓట్లు సాధిస్తూ నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నాడు. రైతుబిడ్డ కాన్సెప్ట్ మనోడికి బాగా కలిసి వచ్చింది. అందుకే ప్రశాంత్ మీద అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ వారం షకీలా లేదంటే టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారి ప్లేస్ లో ఈ 3వ వారం మరో కంటెస్టెంట్ ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది.
సీరియల్ నటుడు వస్తారని అంటున్నారు. అగ్నిసాక్షి సీరియల్ ఫేమ్ అంబటి అర్జున్ హౌస్‍లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం. మొదటి వారంలోనే వస్తాడనే ప్రచారం జరిగింది. కానీ రెండో వారం తర్వాత ఆయన్ను హౌస్ లోకి తీసుకువస్తారని కన్ఫర్మ్ అయిపోయింది. అతను వస్తే మరో సీరియల్ కంటెస్టెంట్ పెరుగుతాడు. బిగ్ బాస్ లో ఇప్పటికే అందరి కంటే ఎక్కువ సీరియల్ కంటెస్టెంట్లే ఉన్నారు. మరి ఆయన ఎంట్రీతో బిగ్ బాస్ లో ఆట మారుతుందా లేదా అనేది చూడాలి.