Bigg Boss : బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షోని వీక్షించనున్న హైకోర్టు.!
NQ Staff - October 12, 2022 / 10:43 PM IST

Bigg Boss : బిగ్ బాస్ రియాల్టీ షోని బ్యాన్ చేయాలంటూ ఏపీ హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. రియాల్టీ షో ముసుగులో అసభ్య కార్యకలాపాలు జరుగుతున్నాయనీ, అత్యంత జుగుప్సాకరంగా ఆ షో నడుస్తోందని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, బిగ్ బాస్ నిర్వాహకులకు నోటీసులు కూడా జారీ చేసింది. తాజాగా, ఈ షోకి సంబంధించి కొన్ని ఎపిసోడ్ల వీక్షణకు హైకోర్టు ధర్మాసనం సమాయత్తమవుతోంది.
అసభ్యత వుందా..? లేదా..?
అసలు అసభ్యతకు అర్థమేంటి.? అంటే, ఈ రోజుల్లో అసభ్యతకు అర్థమే మారిపోయింది. లిప్ లాక్ సీన్స్ కూడా అసభ్యత కాదిప్పుడు. బహిరంగంగానే అన్నీ జరుగుతున్నాయ్.. సినిమాల్లో లిప్ లాక్ సీన్స్ చూస్తున్నాం. అయితే, అలాంటివి ఇంతవరకు బిగ్ బాస్‌లో లేవనుకోండి.. అది వేరే సంగతి.
కౌగలింతలు, పొట్టి డ్రస్సుల్ని అసభ్యతగా భావిస్తారా.? అంటే, దానిపై మళ్ళీ భిన్న వాదనలున్నాయి. ఆడ, మగ.. కంటెస్టెంట్లను ఓ హౌస్‌లో కొన్ని రోజులపాటు బంధించి, బయట సమాజంతో వారికి సంబంధం లేకుండా చేసి, కెమెరాలతో నిత్యం వారిని గమనించడం.. బిగ్ బాస్ రియాల్టీ షోలో కీలమైన వ్యవహారం.
కానీ, అక్కడ అసాంఘీక కార్యకలాపాలే జరుగుతున్నాయనీ, అదొక వ్యభిచార కూపం అనీ రాజకీయ ప్రముఖుడు సీపీఐ నారాయణ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. మరి, హైకోర్టు.. బిగ్ బాస్ రియాల్టీ షో చూసి ఏం తేల్చుతుందో వేచి చూడాలిక.