Bigg Boss Season 6 : బిగ్‌బాస్ 6 లీక్‌ : ఈ వారం నామినేషన్‌ లో ఉండేది వీళ్లే

NQ Staff - September 12, 2022 / 07:08 PM IST

Bigg Boss Season 6 : బిగ్‌బాస్ 6 లీక్‌ : ఈ వారం నామినేషన్‌ లో ఉండేది వీళ్లే

Bigg Boss Season 6 : తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ మొదటి వారం పూర్తి చేసుకుని రెండో వారంలో అడుగు పెట్టింది. రెండో వారంలో మొదటి రోజే ఎలిమినేషన్ కి నామినేషన్ ప్రక్రియ జరిగింది.

నేడు ఏం జరగబోతుంది

అనే విషయంలో ఇప్పటికే లీక్ బయటికి వచ్చేసింది. విశ్వసనీయ లీక్ సమాచారం మేరకు ఈ వారం 8 మంది బయటకు వెళ్లేందుకు నామినేట్ అయినట్లుగా తెలుస్తోంది.

  Bigg Boss Season 6 Second Week Nomination Process For Elimination

Bigg Boss Season 6 Second Week Nomination Process For Elimination

ఎలిమినేషన్ కి నామినేట్ అయిన వారిలో.. ఆది రెడ్డి, అభినయశ్రీ, గీతూ రాయల్, రేవంత్, ఫైమా, రాజశేఖర్, రోహిత్ మరియు మరీనా లు ఉన్నారు. వీరిలో ఈ వారం బయటికి వెళ్లబోయేది ఎవరు అనేది అందరిలో ఉత్కంఠ రేకెత్తించే అంశం.

ఎందుకంటే అందరికీ కూడా మంచి గుర్తింపు అయితే ఉంది.. అయితే కొందరిలో కొన్ని చెడు గుణాలు ఉన్న కారణంగా ఎలిమినేషన్ కి నామినేట్‌ అయ్యారు. వారిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయంటూ మా వర్గాల నుండి సమాచారం అందుతుంది. శని, ఆదివారాల యొక్క ఎపిసోడ్లకు మంచి రెస్పాన్స్ రావడంతో సోమవారం నుండి మరింత రసవత్తరంగా షో ఉండేలా బిగ్ బాస్ నిర్వాహకులు కొత్త కొత్త గేమ్ లను కంటెస్టెంట్ ముందు ఉంచే అవకాశం ఉంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us