Bigg Boss OTT Season 2 Show Akanksha Puri Contestant Jad Hadid Gives Lip Lock బిగ్ బాస్ లో లిప్ లాక్ వివాదం.. సల్మాన్ కు కూడా లిప్ లాక్ ఇస్తా.. ఆకాంక్ష కామెంట్లు..!
NQ Staff - July 4, 2023 / 02:20 PM IST

Bigg Boss OTT Season 2 Show Akanksha Puri Contestant Jad Hadid Gives Lip Lock :
ఇప్పుడు హిందీలో వస్తున్న బిగ్ బాస్ ఓటీటీ సీజన్-2 పెద్ద దుమారమే రేపుతోంది. ఇందులో కంటెస్టెంట్ గా చేస్తున్న ఆకాంక్ష తన తోటి కంటెస్టెంట్ అయిన జైద్ కు లిప్ లాక్ ఇచ్చింది. అతనికి ఆమె లిప్ లాక్ ఇవ్వడం పెద్ద దుమారమే రేపింది. ఆకాంక్షను సోషల్ మీడియాలో ఏకి పారేశారు నెటిజన్లు.
విమర్శలు ఎక్కువ కావడంతో సల్మాన్ కూడా ఫైర్ అయ్యాడు. ఇద్దరికీ క్లాస్ పీకాడు. ఇక ఈ ఆదివారం ఆకాంక్ష హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. బయటకు వచ్చిన ఆమె తనను తాను సమర్ధించుకునే ప్రయత్నం చేసింది. ఆమె ముద్దు సీన్ గురించి మాట్లాడుతూ.. నేను అది ఇష్టపూర్వకంగా చేయలేదు.
టాస్క్ లో భాగంగానే ఇచ్చా..
కేవలం టాస్క్ లో భాగంగానే చేశాను. షోలో టాస్క్ లు పూర్తి చేయడం చాలా ముఖ్యం. ఓ 30 సెకన్ల టాస్క్ లో భాగంగానే జైద్ కి లిప్ లాక్ ఇచ్చాను. అంతే తప్ప అతని మీద నా మనసులో ఎలాంటి ఉద్దేశం లేదు. జైద్ ప్లేస్ లో సల్మాన్ ఖాన్ ఉన్నా సరే అలాగే లిప్ లాక్ ఇచ్చేదాన్ని. అందులో నా తప్పేంలేదు.
కానీ అది ఇంత పెద్ద వివాదం అవుతుందని నేను అనుకోలేదు. సల్మాన్ సీరియస్ అవుతారని ఊహించలేదు అంటూ సంచలన కామెంట్లు చేసింది ఆకాంక్ష. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చేసిన తప్పును ఇంకా సమర్ధించుకుంటున్నావా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు.