Bollywood : బాలీవుడ్‌ బడా స్టార్లకు ఓపెనింగ్సే కరువు.. చిన్న హీరోల ముందు పల్చనవుతున్న పరువు

NQ Staff - October 25, 2022 / 09:39 PM IST

Bollywood : బాలీవుడ్‌ బడా స్టార్లకు ఓపెనింగ్సే కరువు.. చిన్న హీరోల ముందు పల్చనవుతున్న పరువు

Bollywood : ఓవైపు సౌత్‌ సినిమాల వరుస సెన్సేషన్స్‌.. మరోవైపు స్ట్రెయిట్‌ చిత్రాల పూర్‌ కలెక్షన్స్‌ తో బాలీవుడ్‌ గతమెన్నడూ లేనంత డల్ ఫేజ్‌ లో ఉంది పాపం. తెలుగు, కన్నడ సినిమాలు హిందీలో డబ్‌ అయి బీటౌన్‌ బాక్సాఫీస్‌ కి బీటలు వారేలా చేస్తూ ఆ ఇండస్ట్రీకి టఫ్‌ పోటీనిస్తున్నాయి. ప్యాన్‌ ఇండియా ప్రాజెక్టులతో సౌత్‌ చిత్రాలు రచ్చచేస్తుంటే బాలీవుడ్‌ మాత్రం కనీసం హిందీలో అయినా చెప్పుకోదగ్గ ఓపెనింగ్స్‌ కూడా రాబట్టుకోలేక బడా స్టార్లకే దడపుట్టేలా చేస్తున్నాయి.

దీపావళి స్పెషల్‌ గా

ఈ నెల 25న రామ్‌ సేతు, థ్యాంక్‌ గాడ్ అనే రెండు హిందీ చిత్రాలు రిలీజయ్యాయి. అక్షయ్‌ కుమార్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్ కలిసి నటించిన రామ్‌ సేతు మైథలాజికల్ బ్యాక్‌ డ్రాప్‌ అయితే, అజయ్‌ దేవగన్, వరుణ్‌ ధావన్, రకుల్‌ ప్రీత్‌ నటించిన థ్యాంక్‌ గాడ్ సోషియో ఫ్యాంటసీ నేపథ్యంతో తెరకెక్కిన చిత్రం. అందరూ పేరున్న బడా స్టార్సే.

బాలీవుడ్‌ తో పాటు నేషన్‌ వైడ్‌ గా ఫేమ్‌ ఉన్న యాక్టర్సే. పైగా పండగ సీజన్లో రిలీజ్‌. అయినా ఈ రెండు చిత్రాలకి ఓపెనింగ్స్‌ మాత్రం పూర్‌ గా ఉన్నాయి. కొన్ని సెంటర్లలో అయితే మరీ దారుణంగా 20 పర్సెంట్‌ కూడా ఫుల్‌ అవలేదు థియేటర్స్‌. పైగా ఈ రెండు చిత్రాలకి పెద్దగా పాజిటివ్ రివ్యూస్‌ కూడా దక్కకపోవడంతో ఇక ఓవరాల్‌ కలెక్షన్స్‌ ఏ రేంజ్‌ లో ఉంటాయో చెప్పక్కర్లేదు.

ఒకప్పుడు ఇండియన్‌ మూవీ అంటే హిందీ సినిమానే అన్నంతగా లెగసీని మెయింటెయిన్‌ చేసిన ఇండస్ట్రీ బాలీవుడ్. కానీ కొన్నేళ్లుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రొటీన్‌, కమర్షియల్‌, మాస్‌ మసాలా సినిమాలంటే ప్రేక్షకులకు మొఖం మొత్తడం ఓ రీజనయితే, సదరు స్టార్ల మూవీలకి బాయ్‌ కాట్‌ బాలీవుడ్‌ గండం ఉండనే ఉంది.

సినిమా అనౌన్సయిన నాటి నుంచే బాయ్‌ కాట్ బ్యాచ్‌ అలర్టవుతూ రిలీజ్‌ కు ముందే నారాజ్‌ చేసే పనిలో పడుతున్నారు. మరోవైపు పోస్ట్ కోవిడ్ ఎఫెక్టులతో కుదేలైన ఇండస్ట్రీల్లో టాప్‌ ప్లేస్‌ లో ఉండడం మరో మెయిన్‌ రీజన్‌. ఇన్నిటి మధ్య ఆడియెన్సును థియేటర్‌ దాకా ఎలా రప్పించాలో బాలీవుడ్‌ కు క్లూ లేకుండాపోయింది.

ఒకవైపు తెలుగు టైర్ త్రీ హీరోలు బెటర్‌ యాక్యుపెన్సీతో దూసుకుపోతున్నారు. నిఖిల్‌ లాంటి యంగ్‌ హీరోలు కూడా హిందీలో మార్కెట్‌ లేకపోయినా కార్తికేయ టూ లాంటి చిత్రాలతో బాక్సాఫీస్‌ని దున్నేస్తున్నారు. ఆ మూవీ సక్సెస్‌ చూశాక మైథలాజికల్ ప్రాజెక్ట్స్‌ కి ఎప్పటికీ ఆదరణ ఉంటుందని మరోసారి ప్రూవ్‌ అవ్వడంతో రామ్‌ సేతు టీమ్‌ కూడా హిట్‌ మీద ఆశలు పెంచేసుకున్నారు.

అక్షయ్‌ కుమార్‌ లాంటి బడా స్టార్‌ కూడా యాక్ట్‌ చేయడంతో ఓపెనింగ్స్‌ తో పాటు ఓవరాల్‌ వసూళ్లు కూడా భారీగానే వస్తాయని ఊహించారు. కానీ వన్స్‌ సినిమా రిలీజయ్యాక సీన్‌ రివర్సయింది. పేరుకు స్టార్స్‌ ఎందరున్నా, తెరపై కంటెంట్‌ తో మ్యాజిక్‌ జరక్కపోతే మాత్రం ఆడియెన్స్‌ ఆదరించరని మరోసారి క్లారిటీ వచ్చేసింది.

థ్యాంక్‌ గాడ్ విషయంలోనూ అదే జరిగింది. సోషియో ఫాంటసీ జానర్‌ బాక్సాఫీస్‌ సక్సెస్‌ ఫార్ములానే అయినా ప్రాపర్ గా అవుట్‌ పుట్‌ లేకపోతే ప్రేక్షకులు థియేటర్ కొచ్చే ఆలోచన కూడా చేయరని తెలిసొచ్చింది. బాలీవుడ్‌ కి కంటెంట్ కష్టాలు, ఆడియెన్స్‌ ని పుల్‌ చేసే ఐడియాలు కరువవ్వడమే కాకుండా ఇతర భాషా చిత్రాలు నేషన్‌ వైడ్ గా సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తుండడం మరో ప్రధాన సమస్యగా మారింది.

కన్నడ మూవీ కాంతార అన్ని లాంగ్వేజెస్‌ తో పాటు హిందీలోనూ అద్భుతంగా ఆడుతోంది. నిజానికి రిషబ్‌ శెట్టికి బీటౌన్‌ లో ఏ మాత్రం మార్కెట్‌ లేనే లేదనేది ఓపెన్ ఫ్యాక్ట్. అసలతని పేరు కూడా అక్కడి కామన్‌ ఆడియెన్స్‌ వినుండరు. అలాంటిది.. కాంతార రిలీజయ్యాక కలెక్షన్స్‌ తో అభిషేకం చేశారు.రిషబ్‌ పర్ఫామెన్స్‌ కి ఫిదా అయి ఇంకా కొన్నిచోట్ల హౌజ్ ఫుల్‌ కలెక్షన్స్‌ తో ఆదరిస్తున్నారు.

ఇలా మొన్నటివరకూ మార్కెట్‌ లేని హీరోలు కూడా బాలీవుడ్‌ ని షేక్ చేస్తుంటే అక్కడి మేకర్స్‌ అండ్ బడా స్టార్స్‌ మాత్రం ఓపెనింగ్స్‌ రాబట్టుకోడానికి కూడా భారీగా కష్టపడే పరిస్థితొచ్చింది. మరి స్టోరీ సెలక్షన్ తో పాటు, మారుతున్న ఆడియెన్స్‌ టేస్టుని కూడా దృష్టిలో ఉంచుకుని అప్‌ కమింగ్‌ ప్రాజెక్ట్‌ పై ఎలాంటి ఫోకస్‌ పెడతారో చూడాలి మరి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us