Liger : విజయ్ దేవరకొండ ‘లైగర్’ మీద బెట్టింగ్స్ షురూ.!
NQ Staff - August 23, 2022 / 10:00 PM IST

Liger : రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘లైగర్’ మీద అంచనాలు అనూహ్యంగా పెరిగిపోయాయ్.! తెలుగు రాష్ట్రాల్లో ‘లైగర్’ మేనియా నడుస్తోందిప్పుడు. ఆ మాటకొస్తే, దేశవ్యాప్తంగా ఈ మేనియా కనిపిస్తోంది. ఓవర్సీస్‌లో కూడా ‘లైగర్’ రిలీజ్ మేనియా ఓ రేంజ్‌లో వుంది.

Betting on Vijay Devarakondas Liger
ఆగస్ట్ 25న ‘వాట్ లాగాదేంగే..’ అంటూ ‘లైగర్’ హంగామా చేయబోతున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. అనన్య పాండే తెలుగులో తొలిసారి చేస్తోన్న సినిమా ఇది. ప్రపంచ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
బెట్టింగులు మామూలుగా లేవ్..
తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి షేర్ ఎంత వస్తుంది.? తొలి వీకెండ్ వసూళ్ళు ఏ స్థాయిలో వుండబోతున్నాయి.? ఇలా పలు అంశాలపై బెట్టింగులు షురూ అయ్యాయ్. అడ్వాన్స్ బుకింగ్స్ అయితే తెలుగు రాష్ట్రాల్లో అదుర్స్ అనే రేంజ్‌లోనే వున్నాయి.
సినిమాకి అద్భుతమైన రీతిలో ప్రమోషన్స్ జరగడంతో ‘లైగర్’ విడుదలవుతున్న ప్రతి చోటా మంచి రెస్పాన్స్.. రిలీజ్‌కి ముందే కనిపిస్తోంది. విజయ్ దేవరకొండ కెరీర్‌లో ఎలాగూ ‘లైగర్’ సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తుంది.. సినిమా రిజల్ట్ ఎలా వున్నా.! అయితే, పాన్ ఇండియా స్థాయిలో ‘లైగర్’ సృష్టించే వసూళ్ళ అరాచకం ఎలా వుంటుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.