Bandla Ganesh : ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ స్పీచ్‌కి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ కళ్యాణ్ ఎదురుగా ఉంటే ఇంక ఆయన మాటలకు బ్రేక్ అనేదే ఉండదు. తాజాగా బండ్ల గణేష్.. పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ నటించిన చోర్ బజార్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరయ్యారు. అయితే ఈ వేడుకకు పూరీ జగన్నాథ్ హాజరుకాకపోవడంతో బండ్ల గణేష్ సీరియస్ అయ్యారు.

ఫైరింగ్ కామెంట్స్..
ముందుగా పూరీ జగన్నాథ్ సతీమణిని తెగ పొగిడేసిన బండ్ల గణేష్.. ‘ఎంతమందినో స్టార్లను చేశాడు.. సూపర్ స్టార్లను చేశాడు.. డైలాగ్‌లు చెప్పడం రాని వాళ్లకి డైలాగ్‌లు నేర్పాడు.. డాన్స్‌లు రాని వాళ్లకి డాన్స్‌లు నేర్పాడు.. మామూలు వాళ్లని స్టార్లు చేశాడు.. సూపర్ స్టార్లు చేశాడు.. కానీ కన్న కొడుకు సినిమా ఫంక్షన్‌కి మాత్రం రాలేదు.
అదే నేనైతే నేను లండన్‌లో ఉన్నా స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వచ్చేవాడిని. ఎందుకంటే నేను ఉన్నదే నా కొడుకు కోసం.. నా పెళ్లం కోసం.. నా పిల్లల కోసం.. మా అన్న ఎక్కడ ఉన్నాడో.. ఏం బిజీగా ఉన్నాడో.. ఈసారికి అయిపోయింది కానీ ఇంకోసారి ఇలాంటి పని మాత్రం చేయమాకు. ఎందుకంటే మనం ఏం చేసినా వాళ్ల కోసమే. మనం చస్తే తలకొరివి పెట్టాల్సిందే వాళ్లే. మనం సంపాదిస్తే ఆస్తులు వాళ్లకే.. అప్పులు చేస్తే తీర్చేదీ వాళ్లే.
ఆకాష్ అంటే సన్నాఫ్ పూరీ జగన్నాథ్.. ఇంకొకడి పేరురాస్తా రాజ్యాంగా ఊరుకోదు. బండ్ల గణేష్ సన్నాఫ్ బండ్ల నాగేశ్వరరావు అని కాకుండా వేరే వాడి పేరు రాస్తే వచ్చి తన్నుతారు. నువ్ కన్నావ్ కాబట్టి.. అది నీ బాధ్యత. నువ్ వదిన మెడలో తాళి కట్టావ్.. ఆకాశ్‌ని కన్నావ్.. పవిత్రని కన్నావ్.. వాళ్ల రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందే. ఒక్కసారి తీసుకుంటే చచ్చేవరకూ వదిలిపెట్టకూడదు.
- Advertisement -
ఆకాష్‌ని స్టార్‌ని చేయాల్సిందే.. వాడు అవుతాడు.. ఎందుకంటే వాడికి టాలెంట్ ఉంది. ఎవర్నెవర్నో స్టార్లని చేశావ్.. నీ కొడుకు వచ్చేసరికి వెళ్లి ముంబాయిలో ఉన్నావ్.. ఇదెక్కడి న్యాయం అన్నా.. ఇదేందన్నా.. అట్టకాదన్నా.. అట్టా కుదరదు.. మేం ఒప్పుకోం. నువ్ నీ కొడుకుని స్టార్‌ని చేసినా చేయకపోయినా నీ కొడుకు స్టార్ అవుతాడు.. ఛోర్ బజార్ పెద్ద హిట్ అవుతుంది. నువ్ కూడా నీ కొడుకు డేట్స్ కోసం క్యూలో ఉండే రోజు వస్తుంది గుర్తుపెట్టుకో.
నేను ఈరోజు చెప్తున్నా రాస్కో.. నువ్ బ్యాంకాంగ్ పోయి కథ రాసుకుని.. ఆకాష్ కథ చెప్తా వినరా అని ఎదురుచూసే రోజు వస్తుంది గుర్తుపెట్టుకో. అలా జరక్కపోతే నా పేరు బండ్ల గణేష్ కాదు. ఆరోజు వచ్చినరోజు.. ఆకాష్ నువ్ డేట్‌లు ఇవ్వొద్దని చెప్తా. ఆకాష్ అనేవాడు బంగారం.. గబ్బర్ సింగ్‌లో నటించాడు. పూరీ అబ్బాయి సినిమా అంటే.. పూరీ వల్ల స్టార్లు అయిన వాళ్లు వస్తారని అనుకున్నా. పూరీ వల్లే మేం స్టార్లు అయ్యాం.. సూపర్ స్టార్లు అయ్యాం అని చెప్తారని ఎక్స్ పెక్ట్ చేశా.
ఎందుకంటే పూరీ రాత వల్ల స్టార్లు అయ్యి వందలు కోట్లు తీసుకుంటున్నారు.. వాళ్లు ముందుకు వచ్చి పూరీ బాధ్యత తీసుకుంటారని అనుకున్నా.. కానీ వాళ్లు రారు.. సినిమా కదా రారు.. పూరీతో సినిమా కోసం ఎదురుచూసిన వాళ్లు ఎవరూ ఈరోజు పూరీ కొడుకు బాధ్యతని తీసుకోలేదు. ఎవరు వచ్చినా రాకపోయినా ఆకాష్ అనేవాడు సూపర్ స్టార్ అవ్వడాన్ని ఎవరూ ఆపలేరు. వాడు ఖచ్చితంగా స్టార్ అవుతాడు. మా వదిన కన్న కలలు నిజం అవుతాయి. నాకు నా కొడుకు ఎంతో ఆకాష్ కూడా అంతే.. అప్పుడు నువ్ మాత్రం మీ నాన్నకి డేట్స్ ఇవ్వకు అంటూ స్పీచ్ ముగించారు బండ్ల గణేష్.