Bandla Ganesh : చంద్రబాబు, విజయసాయిరెడ్డి కలయికపై బండ్లగణేశ్‌ దారుణమైన కామెంట్లు..!

NQ Staff - February 20, 2023 / 12:22 PM IST

Bandla Ganesh : చంద్రబాబు, విజయసాయిరెడ్డి కలయికపై బండ్లగణేశ్‌ దారుణమైన కామెంట్లు..!

Bandla Ganesh : రాజకీయాలు అన్న తర్వాత శత్రవులు కూడా మిత్రులు అయిపోవడం చాలా కామన్‌. ఎవరు ఎప్పుడు శత్రువలు అవుతారో, ఎవరు ఎప్పుడు మిత్రులు అవుతారో చెప్పడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఇక్కడ శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అనేవారు ఎవరూ ఉండరు. అయితే కొన్ని సార్లు శత్రువులు కూడా సందర్భాన్ని బట్టి మాట్లాడుకోవాల్సి వస్తుంది.

రీసెంట్ గా చంద్రబాబు నాయుడు, విజయసాయిరెడ్డి కూడా ఇలాగే మాట్లాడుకున్నారు. నందమూరి తారకరత్న గత 23 రోజులుగా చికిత్స తీసుకుంటూ చివరకు మరణించిన విషయం తెలిసిందే. ఇక తారకరత్న పార్థివ దేహానికి నివాళి అర్పించేందుకు చంద్రబాబు ఆయన ఇంటికి వెళ్లారు. అయితే అప్పటికే విజయసాయిరెడ్డి అక్కడ ఉన్నారు.

విజయసాయిరెడ్డి భార్య చెల్లెలు కూతురునే తారకరత్న పెండ్లి చేసుకున్నారు. ఆ కారణంగానే తారకరత్న అంత్యక్రియల బాధ్యతలను చూసుకోవడానికి అక్కడే ఉన్నారు విజయసాయిరెడ్డి. దాంతో చంద్రబాబు కూడా విజయసాయిరెడ్డితో మాట్లాడు. పక్కపక్కనే కూర్చుని వీరిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు.

బండ్లకు కౌంటర్లు..

Bandla Ganesh Tweeted On Nara Chandrababu Naidu And Vijayasai Reddy

Bandla Ganesh Tweeted On Nara Chandrababu Naidu And Vijayasai Reddy

కాగా వీరిద్దరి కలయికపై బండ్ల గణేశ్ తాజాగా ట్వీట్ చేశాడు. నా ప్రాణం పోయినా నేను శత్రువులో ఇలా అస్సలు కూర్చోను. అవసరం అనుకుంటే అక్కడి నుంచి లేచి వెళ్లిపోతా గానీ వారితో మాత్రం కలవను. ఇలాంటి పనులు చేస్తే ప్రజల్లో నమ్మకం పోతుంది. బతికితే సింహంలా బతకాలి.

చస్తే సింహంలా చావాలి అంటూ ట్వీట్ చేశాడు బండ్ల. ఆయన సెటైర్‌ రకరకాల కామెంట్లు వస్తున్నాయి సందర్భాను సారం వారిద్దరూ కలిశారని, ఆ మాత్రం తెలియకుండా మాట్లాడకు అంటూ అంతా ఆయనకు కౌంటర్లు వేస్తున్నారు.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us