Bandla Ganesh : బండ్ల గణేష రూటే సెపరేటు: ఫోన్‌లో పచ్చి బూతులు.! ట్విట్టర్‌లో త్రివిక్రమ్‌పై పొగడ్తలు.!

NQ Staff - November 7, 2022 / 03:56 PM IST

Bandla Ganesh : బండ్ల గణేష రూటే సెపరేటు: ఫోన్‌లో పచ్చి బూతులు.! ట్విట్టర్‌లో త్రివిక్రమ్‌పై పొగడ్తలు.!

Bandla Ganesh : కొన్నాళ్ళ క్రితం బండ్ల గణేష్‌ ఆడియో కాల్ ఒకటి లీక్ అయ్యింది. అందులో బండ్ల గణేష్, ప్రముఖ సినీ దర్శకుడు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద బండ్ల గణేష్ బూతులు తిట్టేశాడు. ఆ ఆడియో లీక్ అప్పట్లో పెను సంచలనం.

పవన్ కళ్యాణ్‌కీ తనకూ మధ్య గ్యాప్ రావడానికి త్రివిక్రమ్ కారణమంటూ బండ్ల పరోక్షంగా విమర్శలు చేయడమూ చూశాం. కానీ, ఇప్పుడు సీన్ మారింది. మాటల మాంత్రికుడి పుట్టినరోజున, ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ బండ్ల గణేష్ ఇంట్రెస్టింగ్ ట్వీటేశాడు.

ఆలోచించగలిగే మేధస్సు..

అరరె..! ‘ఆలోచించగలిగే మేధస్సు.. స్పందించగలిగే హృదయం.. అుకువతో కూడిన మనసు.. ఇవన్నీ కలిగి వున్న మా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు..’ అని బండ్లన్న ట్వీటేశాడే.. అంటూ సోషల్ మీడియా వేదికగా బండ్ల గణేష్ అభిమానులే ట్రోల్ చేస్తుండడం గమనార్హం.

ఇంతకీ, బండ్ల గణేష్ పాత గొడవలన్నీ మర్చిపోయాడా.? అప్పట్లో ఎందుకు బూతులు తిట్టినట్టు.? ఇప్పుడెందుకు మాటల మాంత్రికుడి మీద విపరీతమైన మమకారం పెరిగిపోయినట్లు.? ప్యాచప్ కోసమే ఇలా బండ్ల గణేష్ ట్రై చేస్తున్నాడేమో.!

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us