Bandla Ganesh : రాజకీయాల్లో నష్టపోయా: ఇప్పుడందరూ ఆత్మీయులేనన్న బండ్ల గణేష్
NQ Staff - November 29, 2022 / 10:56 PM IST

Bandla Ganesh : ‘రాజకీయాల వలన జీవితంలో చాలా నస్టపోయాను. నాకు ఏ రాజకీయాలతో ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. అందరూ ఆత్మీయులే..’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ వేశాడు సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్.
గతంలో రోజా వర్సెస్ బండ్ల గణేష్.. ఓ ఛానల్లో పెద్ద యాగీ జరిగింది. ఒకర్నొకరు దారుణంగా తిట్టుకున్నారు. ఆ వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ‘రోజాకి మన గణేష్ అన్న కరెక్ట్.. అప్పట్లోనే రోజాకి లైవ్ డిబేట్లో చుక్కలు చూపించిన బండ్లన్న..’ అంటూ పేర్కొనగా, ఆ ట్వీటుపై పై విధంగా స్పందించారు బండ్ల గణేష్.
కోల్పోవడానికి సిద్ధంగా వున్నవాళ్ళే రాజకీయాల్లోకి రావాలి..
‘కోల్పోవడానికి సిద్ధంగా వున్నవారే రాజకీయాల్లోకి రావాలి.. మన బాస్ (పవన్ కళ్యాణ్)లా..’ అంటూ పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు ట్వీటేస్తే, ‘నాకంత స్థాయి లేదు.. అంత గొప్పవాడ్ని కాదు సోదర..’ అంటూ బండ్ల గణేష్ ట్వీటేశాడు.
‘ఎందరో ఆత్మీయుల్ని కోల్పోవాలి.. ఎందరికో శతృవులు కావాలి.. నా మటుకు నేను సినిమా సినిమా సినిమా.. అందులో వున్న కిక్కు ఎక్కడా నాకు దొరకదు అనిపించింది.. అందుకే సినిమానే నా జీవితం..’ అని ఇంకో ట్వీటుపై స్పందించాడాయన.
ఇంకో నెటిజన్, ‘డాష్.. గేయ్’ అని తిడితే, ‘ఓకే బ్రదర్’ అంటూ ఓ నమస్కారం పెట్టేశాడు బండ్ల గణేష్.