Bandla Ganesh : రాజకీయాలకు బండ్ల గణేష్ మళ్లీ గుడ్ బై.! ఇది ఎన్నోసారి.?
NQ Staff - October 29, 2022 / 10:07 PM IST

Bandla Ganesh : సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ తరఫున నానా హంగామా చేశారు. పవన్ కళ్యాణ్‌ని ‘దేవర’ అని సంబోదించే బండ్ల గణేష్ పలు సందర్భాల్లో జనసేన పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకున్న సందర్భాలూ లేకపోలేదు.
అన్నట్టు, బండ్ల గణేష్‌కి తెలుగుదేశం పార్టీతోనూ సన్నిహిత సంబంధాలున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితితోనూ ఆయన సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తుంటారు. అసలు ఏ పార్టీతో బండ్ల గణేష్‌కి పొసగదు.? అనే ప్రశ్న వస్తే.. అసలు సమాధానమే వుండదు. ఎందుకంటే, అన్ని పార్టీల్లోనూ ఆయనకు సన్నిహితులున్నారు.
గతంలోనే గుడ్ బై చెప్పేశారు కదా..
రాజకీయాలకు ఎప్పుడో గుడ్ బై చెప్పేశాడు బండ్ల గణేష్. కానీ, తాజాగా రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు ఇంకో ప్రకటన ట్విట్టర్ ద్వారా విడుదల చేశాడు.
‘నమస్కారం.. నా కుటుంబ బాధ్యతల వల్ల.. నా ఉమ్మడి కుటుంబ సభ్యుల నేపథ్యంలో.. వారి కోరికపై మా పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తూ నాకున్న పనుల వల్ల వ్యాపారాల వల్ల నేను రాజకీయాలకు దూరంగా వుండాలని నిర్ణయించుకున్నాను.
నాకు ఏ రాజకీయ పార్టీతోనూ శతృత్వంగానీ, మితృత్వంగానీ లేదు.. అందరూ నాకు ఆత్మీయులే.. అందరూ నాకు సమానులే.. ఇంతకు ముందు నా వల్ల ఎవరైనా ప్రత్యక్షంగా పరోక్షంగా బాధపడి వుంటే నన్ను పెద్ద మనసుతో క్షమిస్తారని ఆశిస్తూ మీ బండ్ల గణేష్..’ అని పేర్కొన్నాడు బండ్ల గణేష్ ట్విట్టర్‌లో.
ఎక్కడ తేడా కొట్టింది చెప్మా.? ఏమోగానీ, జనసైనికులైతే ఒకింత గుస్సా అవుతున్నారు.. బండ్లన్న రాజకీయాల్లో లేకపోతే, రాజకీయాల్లో మజా ఏముంటుందంటూ సెటైరికల్ కోణంలో.