Balayya : బాలయ్య తిట్టింది జగన్‌ని కాదు, చంద్రబాబుని.!

NQ Staff - January 6, 2023 / 11:16 PM IST

Balayya : బాలయ్య తిట్టింది జగన్‌ని కాదు, చంద్రబాబుని.!

Balayya : నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీర సింహా రెడ్డి’ సినిమాలోని డైలాగుల్ని రాజకీయాలకు ఆపాదిస్తున్నారు కొందరు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీకీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకీ మధ్య రాజకీయ రచ్చ తారా స్థాయికి చేరింది.

‘మా జగనన్ననే అంత మాట అనేస్తావా.?’ అంటూ వైసీపీ అభిమానులు గుస్సా అవుతున్నారు. ‘బాలయ్య దెబ్బకి వైఎస్ జగన్ మైండ్ బ్లాంక్ అయ్యింది..’ అంటూ టీడీపీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇంకోపక్క, ఇరు పార్టీల అభిమానులూ ఆ డైలాగుల్ని ఇంకోలా ఆపాదిస్తున్నారు.

బాలయ్య డైలాగులేంటి.? వాటి అర్థమేంటి.?

‘సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో.. కానీ, చరిత్ర సృష్టించినవాడి పేరు మాదు, మార్చలేరు..’ అన్నది ఓ డైలాగ్. ‘పదవి చూసుకొని నీకు పొగరేమో.. బై బర్త్ నా డీఎన్ఏకే పొగరు ఎక్కువ’ అన్నది ఇంకో డైలాగ్.

ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు మీద బాలయ్య సెటైర్ వేశారన్నది ఓ వాదన. ఇంకోపక్క, టీడీపీని ఎన్టీయార్ నుంచి చంద్రబాబు లాక్కోవడంపై బాలయ్య డైలాగు పేల్చారన్నది మరో వాదన. ఎవరి గోల వారిది.! ఓ వైపు బాలయ్యకు వార్నింగ్ ఇస్తూనే, బాలయ్య చంద్రబాబుని తిట్టారని వైసీపీ అభిమానులంటున్నారు.

మొత్తమ్మీద, బాలయ్య తన ట్రేడ్ మార్క్ డైలాగులతో ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నారన్నమాట. ఈ ప్రకంపనల ఎఫెక్ట్, ఈ సినిమాపై వైసీపీ సర్కారు ఆగ్రహం వ్యక్తం చేసేదాకా వెళ్ళదు కదా.?

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us