Balakrishna : ఎఫ్ 3 చిత్రాన్ని వీక్షించిన బాలయ్య.. ప్రశంసల వర్షం కురిపించాడుగా..!
NQ Staff - June 2, 2022 / 10:11 AM IST

Balakrishna : 2019లో వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలలో వచ్చిన చిత్రం ఎఫ్ 2. అనీల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఈ క్రమంలో ఎఫ్ 3 చిత్రం రూపొందించారు. మే 27న చిత్రాన్ని విడుదల చేయగా, ఈ మూవీకి మంచి రెస్పాన్స్ దక్కింది.
వెంకటేశ్ , వరుణ్ తేజ్ తమన్నా, మెహరీన్ కౌర్ , రాజేంద్రప్రసాద్, అలీ, రఘుబాబు, ప్రగతి, సోనాల్ చౌహాన్, అన్నపూర్ణమ్మ, మురళీ శర్మ..ఇలా ప్రతీ ఒక్కరూ ఎఫ్ 3 ఫన్ రైడ్‌లో భాగస్వామ్యమయ్యారు.
ఎఫ్ 3 సినిమాపై ఇద్దరు స్టార్ సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించారు. నందమూరి బాలకృష్ణ, కామెడీ లెజెండ్ బ్రహ్మానందం చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. బ్రహ్మానందం సినిమా చూసి ఎఫ్ 3 చిత్ర యూనిట్‌ను ప్రశంసించారు. వెంకీ అండ్ టీంతో ఇంటర్వ్యూలో కూడా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా వెంకీ, అలీ, అనిల్ రావిపూడి, వరుణ్ తేజ్ కామెడీ లెజెండీ బ్రహ్మీని హ్యాపీ మూడ్‌లో హత్తుకున్న స్టిల్ ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

Balakrishna watches F3 Special Premiere Show
ఇక ఎఫ్ 3 చిత్రం అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ గా వుంది. సినిమాని చాలా ఎంజాయ్ చేశాను. ఇంత మంచి ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్ టైనర్ ని ప్రేక్షకులకు అందించిన ఎఫ్ 3చిత్ర యూనిట్ కి అభినందనలు” తెలిపారు నటసింహ నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ఎఫ్ 3 ప్రత్యేక ప్రిమియర్ షోని ప్రసాద్ ల్యాబ్స్ లో వీక్షించారు బాలకృష్ణ.
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ మల్టీస్టారర్ ‘ఎఫ్ 3’. డబుల్ బ్లాక్‌బస్టర్ ‘F2’ ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పకులుగా నిర్మాత శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఎఫ్3 మే 27న ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలై యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ తో ప్రభంజనం సృష్టించింది.