Veera Simhareddy Review : ‘వీర సింహారెడ్డి’ రివ్యూ.. మాస్ జాతర అందరి కోసం కాదు

NQ Staff - January 12, 2023 / 07:40 AM IST

Veera Simhareddy Review : ‘వీర సింహారెడ్డి’ రివ్యూ.. మాస్ జాతర అందరి కోసం కాదు

Veera Simhareddy Review : బాలయ్య అభిమానులను ఊగేలా చేసిన అఖండ సినిమా ఇంకా సందడి చేస్తూనే ఉంది. ఈ సమయంలో వస్తున్న వీర సింహారెడ్డి సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. గోపీచంద్ మలినేని గత చిత్రం క్రాక్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో వీరిద్దరి కాంబో కచ్చితంగా మాస్ జాతరే అంటూ ఫ్యాన్స్ అనుకున్నారు. మరి ఆ స్థాయిలో సినిమా ఉందా అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :
వీర సింహారెడ్డి(బాలకృష్ణ), భానుమతి(వరలక్ష్మి శరత్ కుమార్‌) ఒకే తండ్రికి పుట్టిన పిల్లలు. భానుమతి అంటే వీర సింహారెడ్డికి ప్రాణం.. కానీ భానుమతికి వీర సింహారెడ్డి అంటే అసహ్యం.. ఆమె ఎప్పుడు కూడా వీర సింహారెడ్డిని ద్వేషిస్తూనే ఉంటుంది. అన్నయ్య వీర సింహారెడ్డిపై పగ తీర్చుకునేందుకు భానుమతి శత్రువును పెళ్లి చేసుకుంటుంది. కొన్ని కారణాల వల్ల వీర సింహారెడ్డి విదేశాలకు వెళ్తాడు. అక్కడ భానుమతి పథకం ప్రకారం వీర సింహారెడ్డిని హత్య చేయిస్తుంది. ఇంతకు భానుమతికి ఎందుకు వీర సింహారెడ్డి అంటే కోపం? నిజంగానే వీర సింహారెడ్డి చనిపోయాడా? అనేది సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటుల నటన :
వీర సింహారెడ్డి పాత్రకు ప్రాణం పోసినట్లుగా బాలకృష్ణ నటించాడు. ప్రతి సన్నివేశంలో కూడా ఆయన డైలాగ్స్ మరియు బాడీ లాంగ్వేజ్ అదిరి పోయింది. అద్భుతమైన బాలయ్య నటనకు ఫ్యాన్స్ మైమరచి పోవడం ఖాయం. శృతి హాసన్‌ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేదు. ఆమె కామెడీ సన్నివేశాలు ఎబ్బెట్టుగా అనిపించాయి. సినిమాలో బాలయ్య తర్వాత ప్రధాన ఆకర్షణ వరలక్ష్మి శరత్‌ కుమార్‌. ఆమె పాత్ర సినిమా కథలో అత్యంత కీలకం అవ్వడంతో తన నటనతో మెప్పించింది. ఇక హనీ రోజ్ ఉన్నంతలో ఆకట్టుకుంది. మంచి నటనతో మెప్పించింది. మిగిలిన వారు పర్వాలేదు అనిపించారు.

టెక్నికల్ వ్యాల్యూస్ :
దర్శకుడు గోపీచంద్ మలినేని స్క్రీన్‌ ప్లే విషయంలో ఇంకాస్త వర్కౌట్‌ చేస్తే బాగుండేది. ఫస్ట్‌ హాఫ్‌ చాలా బోరింగ్ గా అనిపించింది. హీరో యొక్క పాత్ర పై శ్రద్ద పెట్టినట్లుగా ఇతర విషయాలపై కూడా దర్శకుడు శ్రద్ద పెట్టి ఉన్నట్లయితే కచ్చితంగా మంచి ఔట్ పుట్ దక్కేది. ఎడిటింగ్ లో లోపాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫస్ట్‌ హాఫ్ లో సన్నివేశాలు బోరింగ్‌గా ఉన్నాయి. థమన్ అందించిన సంగీతం యావరేజ్ గా ఉంది. ఒకటి రెండు పాటలు పర్వాలేదు అన్నట్లుగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ పై చాలా నమ్మకం పెట్టుకుంటే నిరాశ పర్చాడు. కొన్ని డైలాగ్స్‌ బాగున్నాయి. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రపీ కొన్ని సన్నివేశాల్లో హైలైట్ గా ఉంది.

విశ్లేషణ :
అఖండం వంటి సినిమా తర్వాత బాలయ్య నుండి వస్తున్న సినిమా కనుక అభిమానులు సహజంగానే ఆ స్థాయిలో సినిమా ను ఆశిస్తారు. కానీ అంత సీన్ లేదు అన్నట్లుగా ఉంది. దర్శకుడు గోపీచంద్ మలినేని నిరాశ పర్చాడు. అబ్బే అన్నట్లుగా ఫస్ట్‌ హాఫ్ ఉంది. ముఖ్యంగా శృతి హాసన్ సన్నివేశాలు బోరింగ్ గా ఉన్నాయి. సెకండ్‌ హాఫ్ లో కథ కాస్త స్పీడ్ గా సాగింది. అంతే కాకుండా పాత్రల యొక్క సీరియస్ నెస్ కూడా పెరిగింది. సినిమా నిడివి తగ్గించి కాస్త తగ్గించి ఉంటే బాగుండేది. మొత్తంగా వీర సింహారెడ్డి మాస్‌ జాతర అభిమానుల వరకే అన్నట్లుగా ఉంది.

ప్లస్ పాయింట్స్ :
బాలకృష్ణ,
వరలక్ష్మి శరత్‌ కుమార్‌,
కొన్నియాక్షన్ సన్నివేశాలు

మైనస్ పాయింట్స్ :
పాత కథ,
ఎంటర్ టైన్మెంట్ లేకపోవడం,
ఫస్ట్‌ హాఫ్‌.

చివరగా…
బాలకృష్ణ అభిమానులకు పర్వాలేదు కానీ అందరికి మాత్రం ఈ సినిమా నచ్చక పోవచ్చు

రేటింగ్ : 2.25/5

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us