Pushpa Movie : పుష్ప 2లో నంద‌మూరి హీరో.. సుకుమార్ ప్లానింగ్స్ మాములుగా లేవు..!

Pushpa Movie : క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ త‌న ప్ర‌తి సినిమాలోను కొత్తద‌నం చూపిస్తూ ప్రేక్ష‌కుల‌ని ఎంట‌ర్‌టైన్ చేస్తూ ఉంటాడు. క్రియేటివ్ గా అందరికంటే భిన్నంగా ఆలోచించే దర్శకుడు సుకుమార్ పుష్ప మొదటి బాగంతో తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద పవర్ఫుల్ ఓపెనింగ్స్ తో సుకుమార్ హీరోల స్థాయిని కూడా పెంచుతూ ఉంటాడు.

Balakrishna in allu arjun Pushpa Movie part 2
Balakrishna in allu arjun Pushpa Movie part 2

పుష్ప ఫస్ట్ పార్ట్ బాక్సాఫీస్ వద్ద 300కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక మొత్తానికి సినిమా అనుకున్నట్లే సక్సెస్ అవ్వడంతో సుకుమార్ తదుపరి సినిమాలపై మరింత ఆసక్తి పెరగనుందని చెప్పవచ్చు. మొదట పుష్ప రెండవ భాగంతో ఆకట్టుకోబోతున్నాడు. పుష్ప ది రూల్ ఈ ఏడాదిలోనే విడుదల కానుంది.

అయితే సెకండ్ పార్ట్‌లో సుకుమార్.. నంద‌మూరి బాల‌కృష్ణ‌ని ఓ ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో చూపించ‌బోతున్న‌ట్టు ప్ర‌చారం న‌డుస్తుంది. ఇటీవలి కాలంలో బన్ని- బాలయ్య మధ్య సాన్నిహిత్యం పరిశ్రమలో ప్రముఖంగా చర్చకు వస్తోంది. అల్లు అర్జున్ అఖండ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు హాజరు కాగా.. ఆ తర్వాత ఆహా సెలబ్రిటీ టాక్ షో – అన్స్టాపబుల్ లో బాలయ్య హోస్ట్ గా కొనసాగినప్పుడు వారి మధ్య అన్యోన్యత అందరికీ అర్థమైంది.

అయితే పరిశ్రమలో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. ఇక్కడ ఎవరు ఎవరిని ట్రాక్ లోకి తెస్తారో చెప్పలేం. ఆకస్మికంగా పుష్ప – 1 సక్సెస్ నేపథ్యంలో పుష్ప 2 చిత్రీకరణకు సిద్ధమవుతున్న సుకుమార్ తదుపరి సీక్వెల్లో బాలకృష్ణను అత్యంత ప్రాధాన్యత ఉన్న ఓ కీలక పాత్రలో నటింపజేసినా ఆశ్చర్యపోనవసరం లేదు అని అంటున్నారు.

ప్ర‌స్తుతం బాల‌కృష్ణ ఆహా అన్‌స్టాప‌బుల్ షోతో పాటు గోపిచంద్ మ‌లినేని సినిమాతో బిజీగా ఉన్నారు. ఆయ‌న ఇటీవ‌ల అఖండ సినిమాతో బ‌డా హిట్ కొట్ట‌గా, ప్ర‌స్తుతం చేస్తున్న అన్‌స్టాప‌బుల్ షో రికార్డులు తిర‌గ‌రాస్తుంది. ఇక గోపిచంద్ మ‌లినేనితో చేస్తున్న తాజా చిత్రం పెద్ద హిట్టైతే బాల‌య్య క్రేజ్‌కి అవ‌ధులే ఉండ‌వ‌ని చెప్పాలి.