Balakrishna As Host Of Telugu Bigg Boss 7 : తెలుగు బిగ్ బాస్ 7 హోస్ట్ గా బాలయ్య.. పాపం నాగ్ ను పక్కన పెట్టేశారా?
NQ Staff - July 11, 2023 / 06:50 PM IST
Balakrishna As Host Of Telugu Bigg Boss 7 :
బిగ్ బాస్ అంటే తెలియని ఇండియన్ ప్రేక్షకులు లేరు. ఇది స్టార్ట్ అయ్యింది హాలీవుడ్ లో అయిన బాలీవుడ్ లోకి తీసుకు వచ్చారు. ఇది క్రమంగా ఇండియా మొత్తం వ్యాపించింది. మన తెలుగులో కూడా 6 సీజన్స్ ను పూర్తి చేసుకుని అయితే ఐదు సీజన్స్ బాగా అలరించిన ఈ షో 6వ సీజన్ మాత్రం సక్సెస్ ఫుల్ చేయలేక పోతున్నారు.
మరి 6వ సీజన్ అట్టర్ ప్లాప్ అవ్వడంతో కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఇప్పుడు 7వ సీజన్ ను స్టార్ట్ చేసారు.. ఇది ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ ఫ్యాన్స్ కు నిన్న గుడ్ న్యూస్ తెలిపారు. ప్రేక్షకులు 7వ సీజన్ కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా సీజన్ 7 ప్రోమో రిలీజ్ చేసారు.
ఈ ప్రోమోలో కేవలం లోగోను మాత్రమే రివీల్ చేసారు.. ఇక ఆగస్టు 2వ వారంలో స్టార్ట్ అవ్వనుంది అనే టాక్ వినిపిస్తుంది.. అయితే హోస్ట్ గా ఎవరు అనేది రివీల్ చేయలేదు.. గత నాలుగు సీజన్స్ నుండి నాగార్జుననే హోస్ట్ గా చేస్తున్నాడు.. అయితే 6వ సీజన్ లో నాగార్జున అస్సలు మెప్పించలేదు అనే ట్రోల్స్ వచ్చాయి.. దీంతో ఈసారి హోస్ట్ గా ఎవరు చేస్తారు అనే దానిపై క్లారిటీ లేదు..
అయితే ఈసారి బిగ్ బాస్ నిర్వాహకులు హోస్ట్ ను మార్చే ప్రయత్నంలో ఉన్నారని టాక్.. నాగార్జునను కాదని బాలయ్యను హోస్ట్ గా తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అని తెలుస్తుంది.. ఇప్పటికే బాలయ్య అన్ స్టాపబుల్ షోకు హోస్ట్ గా చేసారు.. దీంతో అందరిని ఆకట్టు కున్నారు.. దీంతో బిగ్ బాస్ నిర్వాహకులు బాలయ్యను హోస్ట్ గా ఫిక్స్ చేయనున్నారు అని తెలుస్తుంది.