Ashu Reddy : ఆ వార్తలు అవాస్తవం.. నాకు డ్రగ్స్ కేసుతో సంబంధం లేదు.. అషురెడ్డి క్లారిటీ..!
NQ Staff - June 24, 2023 / 08:39 AM IST

Ashu Reddy : సినీ ఇండస్ట్రీలో మళ్లీ డ్రగ్స్ కలకలం రేపుతోంది. అప్పట్లో ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపేయడంతో చాలా మంది బడా సెలబ్రిటీల పేర్లు బయటకు వచ్చాయి. ఏకంగా ఈడీ విచారణ కూడా ఎదుర్కున్నారు. అయితే ఇప్పుడు రజినీకాంత్ హీరోగా నటించిన కబాలి సినిమా నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డారు.
ఆయన్ను ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. తాజాగా ఆయన కస్టడీ రిపోర్టును పోలీసులు వెల్లడించారు. ఆయన బుల్లితెర నటి అషురెడ్డితో వందల ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. అషురెడ్డి బిగ్ బాస్ తో ఫేమస్ అయిపోయింది. ఆ తర్వాత స్టార్ మాలోనే కొన్ని షోలలో నటించింది.
కాగా ఆమె లగ్జరీ లైఫ్ గడుపుతోంది. డ్రగ్స్ అమ్మకంలో ఆమె కూడా ఉందేమో అనే అనుమనాం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వార్తలపై తాజాగా అషురెడ్డి స్పందించింది. ఎవరితో మాట్లాడినా కొన్ని వర్గాల మీడియా కొన్ని రకాల అవాస్తవాలు మాట్లాడుతోందని, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని, నిజానిజాలు ప్రజలకు తెలియజేస్తానని, ఆ విషయం బయటకు వస్తే నా నంబర్ ను పోస్ట్ చేస్తే సహించేది లేదన్నారు.
అంటే తనకు ఆ డ్రగ్స్ కేసులో ఎలాంటి సంబంధం లేదని ఇలా క్లారిటీ ఇచ్చిందన్నమాట. తాను ఎవరితో మాట్లాడినా.. వారు చేసే పనులతో తనకు ఎలా సంబంధం ఉంటుందని ఆమె వాదన. త్వరలోనే ఈ విషయం మీద ఆమె మరింత క్లారిటీ ఇస్తానని చెప్పింది.