Ashu Reddy : అషు రెడ్డి కాళ్ళు పట్టుకున్న ఆర్జీవీ.!
NQ Staff - December 6, 2022 / 10:12 PM IST

Ashu Reddy : దిగజారిపోవడంలో ఎప్పటికప్పుడు కొత్త లోతుల్ని ఆర్జీవీ వెతుక్కుంటాడా.? ఔననే డిస్కషన్ సోషల్ మీడియాలో జరుగుతోంది. తాజాగా ఆర్జీవీకి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బిగ్ బాస్ ఫేం అషు రెడ్డితో గతంలో ఆర్జీవీ ఓ ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో అషు రెడ్డి కాళ్ళను చాలా హాట్‌గా ఆ ఇంటర్వ్యూలో ఆర్జీవీ చూపించాడు. అషు కూడా అస్సలు మొహమాటపడలేదు.
ఈసారి కాళ్ళు పట్టేసుకున్నాడు..
తాజా ఇంటర్వ్యూలో అషు రెడ్డి కాళ్ళు పట్టేసుకున్నాడు ఆర్జీవీ. ఒకప్పుడు ఆయన సంచలన ఫిలిం మేకర్. కానీ, ఇప్పుడు ఆయన వివాదాల ఫిలిం మేకర్. ఇదిగో, ఈ స్థాయికి దిగజారిపోయాడంటూ అషు రెడ్డి షేర్ చేసిన ఫొటోల గురించి జనం మాట్లాడుకుంటున్నారు.
అషు రెడ్డి సోఫాలో కూర్చుంటే, ఆర్జీవీ ఆమె ఎదురుగా కింద కూర్చున్నాడు. పైగా అషు రెడ్డి కాళ్ళు పట్టుకున్నాడు. తెలిసిందే కదా, అషు రెడ్డి అంటే, వీలైనంత షార్ట్ డ్రస్సులు వేస్తుందని.
ఈ పైశాచిక యాంగిల్ ఏంటి ఆర్జీవీ.? అంటూ నెటిజన్లు ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ఈ రోజు రాత్రే ఆ ఇంటర్వ్యూ రాబోతోంది. ఇది డబుల్ డేంజరస్ అట.! అంటే, పెద్దలకి మాత్రమే అనుకోవాలా.?

Ashu Reddy and RGV new photos 1