Ashika Ranganath : డైరెక్టర్‌ అడిగింది చూపిస్తేనే ఆఫర్లు.. యంగ్ హీరోయిన్ ఘాటు కామెంట్లు..!

NQ Staff - February 24, 2023 / 01:50 PM IST

Ashika Ranganath : డైరెక్టర్‌ అడిగింది చూపిస్తేనే ఆఫర్లు.. యంగ్ హీరోయిన్ ఘాటు కామెంట్లు..!

Ashika Ranganath : టాలీవుడ్ లో ఇతర ఇండస్ట్రీల నుంచి వచ్చే హీరోయిన్లదే హవా సాగుతూ ఉంటుంది. అయితే ఒక్కోసారి ఒక్కో హీరోయిన్ హవా కనిపిస్తుంది. కొందరు హీరోయిన్లు అయితే ఒక్క సినిమాతోనే హవాను చూపిస్తుంటారు. వారి పేరు మార్మోగిపోతూ ఉంటుంది. ఇప్పుడు టాలీవుడ్‌ లో ఆశికా రంగనాథ్‌ పేరు ఏ రేంజ్‌లో వైరల్‌ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా వచ్చిన అమిగోస్ మూవీతో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. వస్తూనే మంచి హిట్ అందుకుంది. దాంతో ఆమెకు ఇప్పుడు తెలుగులో మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమెకు సంబంధించిన ఓ వార్త వైరల్‌ అవుతోంది. ఆమె కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన విషయం తెలిసిందే.

గ్లామర్‌ కోసమే..

అయితే ఆమె గతంలో కన్నడ మీడియా ఛానెల్‌కు ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం గ్లామర్‌ చుట్టే తిరుగోతంది. ఇక్కడ అందాలను ఆరబోస్తేనే ఛాన్సులు వస్తాయి. ఎవరికైనా ఛాన్సులు వస్తున్నాయంటే వారి ట్యాలెంట్‌ ను చూసి కాదు.

అందాలను చూసే ఇస్తున్నారు అంటూ బోల్డ్ కామెంట్లు చేసింది ఆశికా రంగనాథ్‌. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. కొందరు ఆమె బరితెగించేస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆమె చెప్పింది కరెక్టే కదా అంటున్నారు. మరి మీ కామెంట్ ఏంటో తెలియజేయండి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us