Arjun : విశ్వక్ సేన్ పై యాక్షన్ కింగ్ ఫిర్యాదు.. అసలేం జరిగిందంటే!
NQ Staff - November 5, 2022 / 10:03 AM IST

Arjun : యంగ్ హీరో విశ్వక్సేన్ పై స్టార్ నటుడు కమ్ డైరెక్టర్ యాక్షన్ కింగ్ అర్జున్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు చేయబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.
యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వం లో విశ్వక్సేన్ హీరో గా అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా ఒక సినిమా ప్రారంభం అయిన విషయం తెలిసిందే. సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి.
ఈ సమయంలో సినిమా నుండి విశ్వక్సేన్ తప్పుకున్నట్లుగా ప్రకటించడం తో సినిమా ఆగి పోయిందట, దాంతో అర్జున్ ఫిల్మ్ చాంబర్లో ఫిర్యాదు చేసేందుకు గాను సిద్ధమవుతున్నాడు అంటూ సమాచారం అందుతుంది.
ఏ కారణం వల్ల సినిమా ఆగి పోయింది అనే విషయంలో ఇప్పటి వరకు అధికారిక క్లారిటీ రాలేదు. కానీ విశ్వక్సేన్ మరియు అర్జున్ ల మధ్య విభేదాలు తలెత్తాయని మాత్రం సోషల్ మీడియా లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
అంతే కాకుండా కథ మరియు స్క్రిప్ట్ విషయం లో కూడా కొన్ని విభేదాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే ఈ విషయమై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. విశ్వక్సేన్ ఇటీవలే ఓరి దేవుడా సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా పరవాలేదు అన్నట్లుగా నిలిచింది.