Bigg Boss Telugu 7 : ఫినాలే అస్త్ర ను గెలుచుకున్న అర్జున్.. ప్రశాంత్, అమర్ కు నిరాశే..!

NQ Staff - December 2, 2023 / 12:01 PM IST

Bigg Boss Telugu 7 : ఫినాలే అస్త్ర ను గెలుచుకున్న అర్జున్.. ప్రశాంత్, అమర్ కు నిరాశే..!

Bigg Boss Telugu 7 :

నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్-7 లో ఇప్పుడు కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్-7లో టికెట్ టు ఫినాలే అస్త్ర కోసం పోటీ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే శుక్రవారం నాడు అర్జున్ ఏకంగా ఫినాలే అస్త్ర ను గెలుచుకున్నాడు. దాంతో ఫైనల్ వీక్ కు ఎంట్రీ ఇచ్చిన తొలి కంటెస్టెంట్ గా నిలిచాడు మనోడు. అతను వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చినా.. అందరికంటే ముందే ఫినాలే వీక్ కు ఎంట్రీ ఇవ్వడం అంటే మాటలు కాదనే చెప్పుకోవాలి. ఫినాలే అస్త్ర సాధించడం కోసం అర్జున్ తో ప్రశాంత్, గౌతమ్ గట్టిగా పోరాడారు.

కానీ చివరకు అర్జున్ ను అద వరించింది. శుక్రవారం నాటి ఎపిసోడ్ త్యాగంతోనే స్టార్ట్ అయింది. గౌతమ్ కు తక్కువ పాయింట్లు ఉండటంతో అతను పోటీ నుంచి వెను దిరిగాల్సి వచ్చింది. దాంతో అతని పాయింట్స్ ను అమర్ దీప్ కు ఇచ్చేశాడు. ఆ తర్వత ఓ టాస్క్ నిర్వహించాడు బిగ్ బాస్. ఆ టాస్క్ లో అర్జున్ అందరికంటే మొదటి స్థానంలో ఉన్నాడు. తర్వాత స్థానంలో గౌతమ్, ప్రశాంత్ నిలిచారు. ఇక కంప్లీట్ అయిన తర్వాత ఓ సరదా సన్నివేశం జరిగింది. అందరికీ టీ ఇచ్చిన బిగ్ బాస్ వారి వారి లవ్ స్టోరీలు చెప్పాల్సిందిగా ఆదేశించాడు.

దాంతో శివాజీ అందరికంటే ముందడుగు వేశాడు. తన భార్యతో తనకున్న లవ్ స్టోరీని వివరించాడు. ఆ తర్వాత శోభాశెట్టి వచ్చి తన లవ్ స్టోరీని వివరించింది. లాక్ డౌన్ లోనే తన ప్రేమ స్టార్ట్ అయినట్టు తెలిపింది. తన ప్రియుడి పేరు యశ్వంత్ రెడ్డి అని త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నట్టు తెలిపింది. ఆ తర్వాత అర్జున్, ప్రశాంత్, అమర్ దీప్ నడుమ మరో టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ముగ్గురూ ఒక తాడు మధ్యలో ఉంటారు. బలంగా లాక్కుని వెళ్లి వారి బుట్టలో జెండాలు వేయాలి. అయితే ఈ ముగ్గురిలో అర్జున్ అందరికంటే ఎక్కువ బలాన్ని ప్రదర్శించాడు. దాంతో అతని ముందు అమర్, ప్రశాంత్ తేలిపోయారు.

అర్జున్ ఈ టాస్క్ లో మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో అమర్, మూడో స్థానంలో ప్రశాంత్ నిలిచారు. దాంతో ప్రశాంత్ రేసు నుంచి తప్పుకున్నాడు. టికెట్ ఫినాలే అస్త్ర ఫైనల్ కంటెండర్స్ గా అమర్, అర్జున్ నిలిచారు. వీరిద్దరి మధ్య జరిగిన ఫైనల్ టాస్క్ పాముతో చెలగాటం.

వీరి ముందు రెండు పామును పోలిన కటౌట్స్ పెట్టారు. అక్కడ దగ్గర్లో ఉన్న పరికరంతో ఆ ముందు ఉన్న పాము నోట్లో బాల్స్ వేయాలి. ఎవరు ఎక్కువ వేస్తే వారే విన్ అవుతాడు. అర్జున్ ఎక్కువ బంతులు వేసి సక్సెస్ అయ్యాడు. దీనితో బిగ్ బాస్ అతడికి టికెట్ ఫినాలే అస్త్ర ప్రజెంట్ చేశారు. ఇలా అందరికంటే మొదట ఫినాలేకు చేరకున్న కంటెస్టెంట్ గా రికార్డు సృష్టించాడు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us