Arjun : వంద కోట్లు ఇచ్చినా విశ్వక్ సేన్ వద్దు.! సినియర్ నటుడు అర్జున్ ఫైర్.!

NQ Staff - November 5, 2022 / 06:54 PM IST

Arjun  : వంద కోట్లు ఇచ్చినా విశ్వక్ సేన్ వద్దు.! సినియర్ నటుడు అర్జున్ ఫైర్.!

Arjun  : సీనియర్ నటుడు అర్జున్ మీడియా ముందుకు వచ్చి ఎప్పుడూ ఎవర్నీ నిందించింది లేదు. కానీ, మాస్ కా దాస్‌గా పిలవబడే విశ్వక్ సేన్‌ని నిందించాల్సి వస్తోంది. అందుకు కారణం అతని ఆటిట్యూడే. మాస్ కా దాస్ అంటూ తనదైన శైలి గుర్తింపు తెచ్చుకున్న హీరో విశ్వక్ సేన్.

అర్జున్ డైరెక్షన్‌లో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు. ఆయన తనయ ఐశ్వర్య అర్జున్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. కథ బాగా నచ్చింది. చించేద్దాం. పొడసేద్దాం.. అన్న హీరో లాస్ట్ మినిట్‌లో హ్యాండిచ్చేశాడు. ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. అసలేం జరిగింది.? వివరాల్లోకి వెళితే..

విశ్వక్ సేన్‌‌ని మించిన హీరోతో సినిమా చేస్తా..

టాలీవుడ్‌లో టాప్ రైటర్ అయిన సాయి మాధవ్ బుర్రా మాటలు విశ్వక్‌సేన్‌కి నచ్చలేదు. చంద్రబోస్ లిరిక్స్ నచ్చలేదు. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ కూడా నచ్చలేదట. అయినా కథ నచ్చేయడంతో ఫైనల్‌గా కన్విన్స్ అయ్యాడట.

రెమ్యునరేషన్ విషయంలో కాస్త ఇష్యూ చేస్తే దాన్ని కూడా సెటిల్ చేశాడట డైరెక్టర్‌గా అర్జున్. అంతా బాగానే వుంది.. ఎందుకు విశ్వక్ హ్యాండిచ్చాడు.? ఏది ఏమైతేనేం, నా ప్రాజెక్ట్ అయితే ఆగిపోదు.

విశ్వక్ సేన్ కన్నా హ్యండ్సమ్ హీరో, మంచి హీరోతో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తా.. అని అర్జున్ అన్నారు. నా సినిమా వంద కోట్లు బిజినెస్ చేసేయాలన్న పెద్ద ఆశ ఏమీ లేదు కానీ, ఓ మంచి సినిమాని తెరకెక్కించానన్న తృప్తి మిగిలితే చాలు అని అర్జున్ తెలిపారు. నిర్మాతల మండలి నిర్ణయం తర్వాత నెక్స్‌ట్ ఏంటీ.? అనేది ప్రకటిస్తానన్నారు అర్జున్.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us