Archana Gautam : కన్నీళ్లు పెట్టుకుంటూ టీటీడీ అధికారులపై నటి విమర్శలు
NQ Staff - September 5, 2022 / 08:50 PM IST

Archana Gautam : హిందీ సినీ నటి అర్చన గౌతమ్ నేడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్లారు. అక్కడ ఆమెకు టీటీడీ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తాను డబ్బులు చెల్లించినప్పటికీ దర్శన టోకెన్ ఇవ్వలేదని ఆమె ఆరోపించింది.

Archana Gautam serious comments on TTD Staff
కార్యాలయంలో తాను ఫిర్యాదు చేసేందుకు వెళ్ళగా అక్కడికి సిబ్బంది తనను కొట్టేందుకు ప్రయత్నించారని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. తనతో తప్పుగా ప్రవర్తించిన వారికి దేవుడు తగిన శిక్ష విధించాలని కోరుకుంటున్నట్లుగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఆమె టిటిడి అధికారులను విమర్శించింది.
భారతదేశంలోనే అత్యంత గొప్పదైన హిందూ ధార్మిక స్థలాల్లో ఒకటి అయిన తిరుమల తిరుపతి దేవస్థానం ఇలా దోపిడీ స్థలంగా మారి పోయింది అంటూ ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. విఐపి దర్శనం పేరుతో ఒక వ్యక్తి నుంచి రూ. 10,500 తీసుకుంటున్నారని ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటే అధికారులు నోరు మెదపడం లేదంటూ ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది.
తనతో తప్పుగా ప్రవర్తించిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో కార్యాలయంలోనే ఆమె ఒక సెల్ఫీ వీడియోను తీసుకొని ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియజేసేందుకు ప్రయత్నించగా.. అక్కడే ఉన్న టీటీడీ అధికారులు ఆమెని అడ్డుకొని బయటికి పంపించే ప్రయత్నం చేయడం వీడియోలో కనిపిస్తుంది.
ఈ సంఘటనపై ఇప్పటి వరకు టీటీడీ అధికారికంగా ఎలాంటి స్పందన ఇవ్వలేదు. అయితే నటి అర్చన నే టీటీడీ అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించిందని, ఆమె దురుసు ప్రవర్తన పూర్తిగా సీసీ కెమెరా లో రికార్డు అయిందని కచ్చితంగా ఆమెపై చర్యలు తీసుకుంటామంటూ పేర్కొన్నారు.
బాలీవుడ్ లో నటిగా గుర్తింపు దక్కించుకున్న ఈమె ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుండి నటిగా మరియు రాజకీయ నాయకురాలుగా ఈమె కొనసాగుతున్నారు.