AP Government: డిస్ట్రిబ్యూటర్ లను ఎలాంటి వివరాలు అడగలేదు: ఏపీ ప్రభుత్వం

AP Government: తెలుగు సినీ ఇండస్ట్రీకి, ఏపీ ప్రభుత్వానికి మధ్య పెద్ద వాదోపవాధనలు వినిపిస్తున్నాయి. రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత నాంది పలికింది. ఇక లేటెస్ట్ గా సోషల్ మీడియాలో ఓ వార్త తెగ హల్ చల్ అవుతుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరిలేరు నీకెవ్వరూ, అల వైకుంఠపురములో సినిమాల కలెక్షన్ వివరాలను తమకు అందించాలని డిస్ట్రిబ్యూటర్స్ ని కోరినట్లు ఈ వార్త సారాంశం. అయితే ఈ వార్త పూర్తిగా అవాస్తవం అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొట్టి పడేసింది.

దాంతో పాటు ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు ఏ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర్నుండి ఎలాంటి సినిమా వివరాలను గానీ, బాక్సాఫీస్ వద్ద ఎన్ని కలెక్షన్లు వచ్చాయనే విషయాన్ని ఏ ఒక్కరూ అడగలేదని స్పష్టతనిచ్చింది.

అయితే ఇది కేవలం సోషల్ మీడియాలో హల్ చల్ అయ్యే వార్తలానే తెలుస్తుంది. లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ కు, ఏపీ ప్రభుత్వానికి మధ్య పెద్ద మాటల యుద్ధమే సాగుతుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కూడా అభిమానులతో పాటు నెటిజన్లు కూడా తమ స్టైల్లో కామెంట్స్ చేస్తున్నారు.

పలు రకాల పోస్టులతో తెగ వైరల్ అవుతున్న వార్తలు చాలానే ఉన్నాయి. ఏది ఏమైనా టాలీవుడ్ సినిమా టికెట్ల వివాదం ఇంకెంత వరకు వెళ్తుందో వేచి చూడాలి.