Anupamma Parameswaran : అనుపమ ఒకే ఒక్క ఆశ.! ఇది విఫల ప్రేమకు సంకేతమా.?

NQ Staff - September 12, 2022 / 06:23 PM IST

Anupamma Parameswaran  : అనుపమ ఒకే ఒక్క ఆశ.! ఇది విఫల ప్రేమకు సంకేతమా.?

Anupamma Parameswaran  : మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తెలుగు తెరపై పలు సినిమాల్లో నటించి, మెప్పించిన విషయం విదితమే. తాజాగా ‘కార్తికేయ-2’ సినిమాతో బంపర్ హిట్ కొట్టింది ఈ రింగి రింగుల హెయిర్ కలిగిన పోరీ.!

గతంలో అనుపమ పరమేశ్వరన్ ఒకర్ని గాఢంగా ప్రేమించిందట. ఆ ప్రేమ విఫలమయ్యిందట కూడా.! ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పింది. అతనో క్రికెటర్ అనీ, ఆ క్రికెటర్ పేరు జస్‌ప్రీత్ బుమ్రా అనీ.. అంటుంటారనుకోండి.. అది వేరే సంగతి.

ఈ వైరాగ్యం దేనికి సంకేతం.?

Anupamma Parameswaran Latest Cute Video

Anupamma Parameswaran Latest Cute Video

తాజాగా అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసింది. ఆమె రింగు రింగుల జుట్టు అలా అలా ఎగురుతూ వుంది ఆ వీడియోలో. ‘మళ్ళీ కలవాలని నా గుండె పరితపిస్తోంది.. అదే నాకున్న ఒకే ఒక్క ఆశ..’ అంటూ లవ్ సింబల్ పెట్టింది ఆ వీడియోలో అనుపమ.

ఇంతకీ ఎవర్ని కలవాలని అనుపమ గుండె అంతలా పరితపిస్తోందట.? దీనర్థం ఆమె మళ్ళీ ప్రేమలో పడిందనేనా.? ‘ఊర్కో.. పబ్లిసిటీ స్టంట్లు చేయొద్దు..’ అంటూ సెటైర్లేస్తున్నారు నెటిజన్లు. ‘స్టే స్ట్రాంగ్ బ్యూటీ..’ అంటూ ఇంకొందరు అనుపమకి మద్దతుగా స్పందిస్తున్నారు.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us