Anupama Parameswaran : క‌వ్విస్తున్న అనుప‌మ‌.. అంద‌చందాల‌కు అంతా ఫిదా..!

Anupama Parameswaran : మ‌ల‌యాళం నుండి వ‌చ్చిన ముద్దుగుమ్మ‌లు తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో స‌త్తా చాటుతున్నారు. ప్రేమమ్ అనే సినిమాతో మలయాళ చిత్ర పరిశ్రమలోకి వచ్చిన అనుపప స్టార్ హీరోయిన్ గా క్రేజ్ అందుకునేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. అనుపమకు ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో అవకాశాలు ఎక్కువగా వచ్చాయి.

Anupama Parameswaran new super cute photos
Anupama Parameswaran new super cute photos

త్రివిక్రమ్ తెర‌కెక్కించిన ‘అఆ’ సినిమాలో అనుప‌మ సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె సెకండ్ హీరోయిన్ అయినప్పటికీ కూడా సమంత కంటే ఎక్కువ స్థాయిలో తన నటనతో ఆకట్టుకుంది. ఇక శర్వానంద్ తో శతమానం భవతి సినిమా అప్పట్లో అత్యధిక ప్రాఫిట్స్ అందించిన సినిమాల లిస్ట్ లో చేరింది. ఆ సినిమా తర్వాత గ్యాప్ లేకుండా అనుపమ పరమేశ్వరన్ కు పదుల సంఖ్యలో ఆఫర్లు వచ్చాయి.

Anupama Parameswaran new super cute photos
Anupama Parameswaran new super cute photos

ప్ర‌స్తుతం అనుప‌మ దిల్ రాజు బ్యానర్‌లో రౌడీ బాయ్స్ సినిమాలోనూ నటిస్తోంది. ఈ సినిమాతో దిల్ రాజు వారసుడు ఆశిష్ రెడ్డి పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాను శ్రీ హర్ష కన్నెగంటి తెరకెక్కిస్తున్నాడు. ఇందులో అమ్మడు ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. ఈ సినిమా కోసం లిప్ లాక్ సీన్స్ కూడా చేసింది అనుపమ.

Anupama Parameswaran new super cute photos
Anupama Parameswaran new super cute photos

కెరీర్ మొద‌టి నుండి ప‌ద్ద‌తిగా కనిపించిన అనుపమ.. మొదటి సారి ఈ సినిమా కోసం రెచ్చిపోవటంతో హాట్ టాపిక్ గా మారింది . రౌడీ బాయ్స్ సినిమాలో ఏకంగా 5 లిప్ లాక్ సీన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. జనవరి 14న విడుదల కానుంది ఈ చిత్రం. తాజాగా విడుదలైన ట్రైలర్‌లోనే లిప్ లాక్ తో ప్రమోట్ చేస్తున్నారు నిర్మాతలు.

Anupama Parameswaran new super cute photos
Anupama Parameswaran new super cute photos

ఇక సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు త‌న అంద‌చందాల‌కు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తుంటుంది. తాజాగా అనుప‌మ హోయ‌లు పోతూ కొన్ని పిక్స్ షేర్ చేసింది. ఇవి అంద‌రి మ‌తులు పోగొడుతున్నాయి. అనుప‌మ క్యూట్ పిక్స్ పై నెటిజ‌న్స్ స్ట‌న్నింగ్ కామెంట్స్ పెడుతున్నారు.