Anupama Parameswaran : బాబోయ్ అనుప‌మ ఏంది ఇంత రెచ్చిపోతుంది.. లిప్ లాక్ సీన్స్‌లోను త‌గ్గ‌ట్లేదుగా..!

Anupama Parameswaran : కేర‌ళ కుట్టి అనుప‌మ పర‌మేశ్వ‌ర‌న్ తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా సుప‌రిచితం.ఈ అమ్మ‌డు కెరీర్ మొద‌ట్లో మంచి సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచేది. అంతేకాదు ఎక్క‌డ కూడా గ్లామ‌ర్ షో చేసేది కాదు. వరస విజయాలతో తెలుగుకు వచ్చిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ అయిపోతుందని అనుకున్నారంతా. కానీ హ్యాట్రిక్ విజయాల తర్వాత ఊహించని విధంగా చతికిలపడింది అనుపమ.

Anupama Parameswaran kiss with new hero in rowdy boys
Anupama Parameswaran kiss with new hero in rowdy boys

ఇటీవ‌ల అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌కి అవ‌కాశాలు అంతంత మాత్రంగానే వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం గీతా ఆర్ట్స్‌లో నిఖిల్ హీరోగా వస్తున్న 18 పేజెస్ సినిమాతో పాటు నిఖిల్‌తోనే కార్తికేయ 2 సినిమాలోనూ నటిస్తుంది. ఇక దిల్ రాజు బ్యానర్‌లో రౌడీ బాయ్స్ సినిమాలోనూ నటిస్తుంది అనుపమ. ఈ సినిమాతో దిల్ రాజు వారసుడు ఆశిష్ రెడ్డి పరిచయం అవుతున్నాడు.

ఈ సినిమాలో అనుప‌మ ఎప్పుడు లేని విధంగా రెచ్చిపోయింది. ఇప్పటి వరకు చాలా పద్దతిగా కనిపించిన అనుపమ.. మొదటి సారి ఈ సినిమా కోసం రెచ్చిపోయింది. ఒకటి రెండు కాదు.. రౌడీ బాయ్స్ సినిమాలో ఏకంగా 5 లిప్ లాక్ సీన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. జనవరి 14న విడుదల కానుంది ఈ చిత్రం. తాజాగా విడుదలైన ట్రైలర్‌లోనే లిప్ లాక్ ఇచ్చేసింది అనుపమ పరమేశ్వరన్.

ఇక సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనుప‌మ త‌న అంద‌చందాలు కూడా ఆర‌బోస్తూ ర‌చ్చ లేపుతుంది. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పట్నుంచి ఒక లెక్క అన్నట్లు నడుము చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది అనుపమ. వాటిని చూసిన తర్వాత ఫ్యాన్స్ కూడా వామ్మో అనుకుంటున్నారు.

ఇకపై సినిమాల్లో కూడా కారెక్టర్ డిమాండ్ చేస్తే గ్లామర్ షో చేయడానికి సిద్ధంగానే ఉన్నట్లు హింట్స్ ఇస్తుంది ఈ కుట్టి. అప్పుడప్పుడూ అభిమానులతోనూ ముచ్చటిస్తూ సమాధానాలు కూడా బాగానే ఇస్తుంది అను. ఈ క్రమంలోనే ఈ మధ్య ఓ నెటిజన్ అనుపమను ఓ పిచ్చి ప్రశ్న అడిగాడు. నీ బికినీ ఫోటో పంపు అంటూ అనుపమ పరమేశ్వరన్‌ను నేరుగా అడిగేసాడు ఆ నెటిజన్. దాంతో అమ్మడుకు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే కోపంతో ఊగిపోయింది అనుపమ.