Anupama Parameswaran Jr NTR Rejected Film : అప్పుడు లిప్ లాక్ కు భయపడి ఎన్టీఆర్ సినిమా రిజెక్ట్ చేశా.. అనుపమ కామెంట్లు..!
NQ Staff - July 10, 2023 / 10:39 AM IST

Anupama Parameswaran Jr NTR Rejected Film :
అనుపమ పరమేశ్వరన్ అంటే యూత్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె చేసిన సినిమాలతో ఆమెకు ఇలాంటి క్రేజ్ ఏర్పడిందని చెప్పుకోవాలి. ఆమె క్యూట్ స్మైల్ కు చాలామంది అభిమానులు ఉన్నారు. అయితే అనుపమ మొదట్లో కొన్ని కండీషన్లు పెట్టుకుంది. లిప్ లాక్ సీన్లు చేయొద్దని, వల్గర్ సీన్లు చేయొద్దని ఇలా అనుకుంది.
అందుకే అనుపమ పరమేశ్వరన్ చాలా సినిమాలను రిజెక్ట్ చేసిందంట. ఇలా ఆమె రిజెక్ట్ చేసిన సినిమాలా చాలా వరకు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఆ సినిమాలు చేసిన వేరే హీరోయిన్లు స్టార్ హీరోయిన్లు అయ్యారంట. ఈ విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది ఈ భామ. నాకు గతంలో నాకు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ వచ్చింది.
ముందే చెప్పిన డైరెక్టర్..
సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమాలో ముందు నన్ను అడిగారు. నేను అప్పుడే ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటున్నా. కానీ ఆ సినిమాలో లిప్ లాక్ సీన్లు ఉన్నాయని డైరెక్టర్ గారు ముందే చెప్పారు. కానీ సినిమాల్లో అలాంటివి చేయొద్దని నేను రూల్ పెట్టుకున్నాను.

Anupama Parameswaran Jr NTR Rejected Film
అందుకే ఇష్టం లేకపోయినా ఆ సినిమాను వదులుకున్నాను. కానీ ఇప్పుడు అలాంటి సీన్లు చేస్తున్నాను. అప్పుడు ఆ సినిమా చేసి ఉంటే నేను కచ్చితంగా మంచి పొజీషన్ లో ఉండేదాన్నేమో అంటూ కామెంట్లు చేసింది అనుపమ. నాన్నకు ప్రేమతో సినిమా చేస్తే నిజంగానే అనుపమ స్టార్ హీరోయిన్ అయ్యుండేదేమో. పాపం మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది.