Anupama Parameshwaran : రాజమౌళి కాళ్ళు మొక్కిన అనుపమ.! ఇదేం గోల సామీ.!
NQ Staff - August 13, 2022 / 09:39 PM IST

Anupama Parameshwaran : మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ ‘అఆ’ సినిమాతో మన తెలుగింటి అమ్మాయిగా మారిపోయింది. ఎంచక్కా తెలుగులో మాట్లాడుతుంటుంది. స్టార్ హీరోయిన్ అయ్యే లక్షణాలున్నా, ఎక్కడో లక్కు తేడా కొడుతోంది ఈ బ్యూటీకి.

Anupama Parameshwaran touch feet of Rajamouli
అందుకేనేమో, జక్కన్న కాళ్ళకు నమస్కరించింది.. అంటూ సోషల్ మీడియాలో నెటిజనం కామెంట్లేస్తున్నారు. తాజాగా జక్కన్నను కలిసింది అనుపమ పరమేశ్వరన్. ఈ క్రమంలో జక్కన్న కాళ్ళకు నమస్కరించింది అనుపమ. దాంతో, ఒక్కసారిగా అంతా అవాక్కయ్యారు.
పెద్దల పట్ల భక్తి మంచిదేగానీ..
పెద్దల పట్ల భక్తి వుండాల్సిందే. కానీ, ఈ రోజుల్లో హీరోయిన్లు ఇలా ఇతరుల కాళ్ళకు నమస్కరించడం చాలా అరుదైన వ్యవహారంగా మారిపోయింది. అఫ్‌కోర్స్ కొందరైతే, బలవంతంగా ఇతరుల చేత తమ కాళ్ళకు మొక్కించేసుకుంటుంటారనుకోండి.. అది వేరే సంగతి.
జక్కన్న, తెలుగు సినిమా ఖ్యాతిని కనీ వినీ ఎరుగని రీతిలో పెంచిన దర్శకుల్లో అగ్రగణ్యుడిగా చెప్పుకోవచ్చు. సో, జక్కన్నకు పాదాభివందనం చేయడం ద్వారా ఆయన ఆశీస్సులు పొందడాన్ని తప్పు పట్టలేం.
అన్నట్టు, అనుపమ తాజా చిత్రం ‘కార్తికేయ-2’కి మంచి వసూళ్ళు వస్తోన్న విషయం విదితమే. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ లెక్కన అనుపమ కూడా పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయిందని అనుకోవచ్చేమో.