Anupama Parameshwaran : లిప్‌లాక్‌పై వైర‌ల‌వుతున్న మీమ్స్.. స్పందించిన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్

Anupama Parameshwaran : కేర‌ళ కుట్టి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప్రేమ‌మ్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌కరించిన విష‌యం తెలిసిందే. అ..ఆ సినిమాతో అనుప‌మ‌కి భారీ క్రేజ్ ద‌క్కింది. ప్ర‌స్తుతం రౌడీబాయ్స్ అనే సినిమాతో పాటు ప‌లు సినిమాల‌లో న‌టిస్తుంది.మ‌రోవైపు ఎప్పటికప్పుడు త‌న ఫోటోల‌ను ఫ్యాన్స్‌తో పంచుకొంటుంది. ఇక అనుపమా పరమేశ్వరన్ లిప్ లాక్ కిస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ కు గురి అవుతోంది.

Anupama Parameshwaran
Anupama Parameshwaran

ఎంత రెమ్యునేషన్ ఇస్తే మాత్రం ఇలా కొత్త కుర్రాళ్లకు లిప్ లాక్ ఇచ్చేస్తావా అని కొందరు అంటున్నారు. మరికొందరు..లిప్ లాక్ ఇవ్వటానికి ఓ స్దాయి ఉండాలనేది చూసుకోవా అని నిలదీస్తున్నారు. ఇంకొందరైతే మా హీరోకు కూడా ఇవ్వాల్సిందే నెక్ట్స్ సినిమాలో అంటూ స్వీట్ వార్నింగ్ లు ఇస్తున్నారు. అంతా ఆమె పై అభిమానంతోనే అని అర్దమవుతోంది.

Anupama Parameshwaran
Anupama Parameshwaran

ఇప్పటి వరకూ అసలు అనుపమలో అలాంటి యాంగిల్ ను అస్సలు చూడని ఆమె అభిమానులు, ప్రేక్షకులు ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. ట్రైలర్ ఇలా విడుదలైందో లేదో అలా ఆమె ముద్దు సన్నివేశంపై అనేక మీమ్స్ సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్న తన లిప్ లాక్ మీమ్స్ పై అనుపమ తాజాగా స్పందించింది.

రౌడీబాయ్స్ ప్ర‌ధాన పాత్రధారులు మీమ్స్ ను చూసి, అభిమానుల క్రియేటివిటీకి, వాళ్ల వ్యాఖ్యలకు బిగ్గరగా నవ్వేశారు. తరువాత అనుపమ లిప్‌లాక్ సినిమాలో ఒక భాగం మాత్రమే అని అభిమానులను ఊరడించే ప్రయత్నం చేసింది. సినిమాలో తన పాత్రను ముద్దు పెట్టింది ఆశిష్ పాత్ర అని చెప్పింది. సినిమాలోని ఆ సీన్స్ చూస్తే నెటిజన్లు మనసు మార్చుకుంటారని కూడా ఈ జంట హామీ ఇచ్చింది.

మొత్తానికి లిప్ లాక్ సంచలనాన్ని కూడా సినిమా ప్రమోషన్స్ లా మార్చేసుకున్నారు ‘రౌడీ బాయ్స్’. సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. రౌడీ బాయ్స్ సినిమాలో ఏకంగా 5 లిప్ లాక్ సీన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. జనవరి 14న విడుదల కానుంది ఈ చిత్రం.