Allu Sirish And Anu Emmanuel : శిరీష్ తో రిలేషన్ గురించి అరవింద్ గారు నన్ను అడిగేశారు
NQ Staff - November 5, 2022 / 01:03 PM IST
Allu Sirish And Anu Emmanuel : అల్లు శిరీష్ హీరో గారు పొందిన ఊర్వశివో రాక్షసివో సినిమా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ సమయం లో అల్లు శిరీష్ మరియు హీరోయిన్ అను ఎమాన్యూల్ మధ్య రిలేషన్ నడుస్తోంది అంటూ ప్రచారం జరిగింది.
ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని… అల్లు ఫ్యామిలి వారు నో చెప్పడం తో శిరీష్ చాలా సీరియస్ గా ఉన్నాడంటూ రకరకాలుగా పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఆ విషయమై ఇద్దరు కూడా క్లారిటీ ఇచ్చారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూ లో హీరోయిన్ మాట్లాడుతూ ఆ సమయం లో మీడియా లో వార్తలను చూసి మా అమ్మ చాలా టెన్షన్ పడ్డారు. ఆమె పదే పదే ఈ విషయం గురించి ఆలోచించి భయపడే వారు.
అల్లు అర్జున్ తో నా పేరు సూర్య సినిమా చేసిన కారణంగా వారి ఫ్యామిలీ తో నాకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆ సన్నిహిత సంబంధాలతో అల్లు అరవింద్ గారు నన్ను ఒక సారి మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి అడిగారు.
నిజంగానే ప్రేమలో ఉన్నారా అన్నట్లుగా ఆయన నన్ను ప్రశ్నించడంతో ఇద్దరం గట్టిగా నవ్వేసుకున్నాం అంటూ అను ఎమ్మానియేల్ చెప్పుకొచ్చింది. ఈ సినిమా ప్రారంభానికి ముందు ఒక్కసారి కూడా శిరీష్ తో కలవలేదని, సినిమా అనుకున్న తర్వాతే మొదటి సారి కాఫీ షాప్ లో కలిసి స్క్రిప్ట్ చర్చలు చేశామని ఆమె పేర్కొంది.