Anu Emmanuel : అనూ ఇమ్యాన్యుయేల్ హాట్ అప్పీల్.! అజంతా శిల్ప సౌందర్యమే.!

NQ Staff - November 26, 2022 / 10:11 PM IST

Anu Emmanuel : అనూ ఇమ్యాన్యుయేల్ హాట్ అప్పీల్.! అజంతా శిల్ప సౌందర్యమే.!

Anu Emmanuel : ‘మజ్ను’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన మలయాళ ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్. తొలి సినిమాకే సమ్‌థింగ్ డిఫరెంట్ అనిపించుకుంది. అందాల ఆరబోతలో పాపకి ఎలాంటి హద్దుల్లేవ్ కానీ, తొలి సినిమాలో హార్ట్ టచ్చింగ్‌గా కనిపించింది.

పెద్దగా ఎక్స్‌పోజింగ్ జోలికి పోలేదు. ఆ తర్వాత అంచెలంచెలుగా గ్లామర్ కంచెలు తొలగించి వేసేసింది. గ్లామర్ కంచెలు తీసేయడంతోనే, అనూకి ఆఫర్ల వరద కూడా క్యూ కట్టింది.

అంతవరకూ చిన్న హీరోలతోనే తెరను పంచుకున్న అనూ ఇమ్మాన్యుయేల్ సెడన్‌గా స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్‌లతో రొమాన్స్ చేసే బంపర్ ఛాన్స్ కొట్టేసింది.

దొరికిందే ఛాన్స్ అని, అస్సలు నో చెప్పకుండా గ్లామర్‌కి సై అనేసింది. స్టార్ ఛాన్సులైతే వరించాయ్ కానీ, స్టార్ డమ్‌కి ఆమడ దూరంలోనే ఆగిపోయింది అనూ ఇమ్మాన్యుయేల్.

హాట్‌నెస్ విత్ ఇన్నోసెన్స్..

మధ్యలో లాంగ్ గ్యాప్ తీసుకుని, మళ్లీ ఇప్పుడే కెరీర్‌లో పుంజుకుంటోంది. అల్లు శిరీష్‌తో ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాతో అనూ మళ్లీ సోదిలోకి వచ్చింది.
హిట్టులాంటి హిట్టు కొట్టేసింది ఈ సినిమాతో అనూ ఇమ్మాన్యుయేల్. హిట్టు మాట పక్కన పెడితే, గ్లామర్ ఇమేజ్ బాగా దక్కించుకుంది. ఈ సినిమాలో హీరోతో హద్దులు దాటిన రొమాన్స్ కూడా అందుకు ఓ కారణం కూడా కావచ్చు.
సర్లే వచ్చిన ఇమేజ్ ఎలాగూ వచ్చింది కదా.. సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో ఇంకాస్త ఇమేజ్ బిల్డప్ చేసుకుంటోంది. తాజాగా సిల్వర్ షైన్స్ శారీలో అజంతా శిల్పంలా హోయలు పోతూ అనూ ఇచ్చిన పోజుకి కుర్రకారులో టెంపరేచర్లు అమాంతం పెరిగిపోతున్నాయంతే.!

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us