Ankit Gupta : నన్ను కూడా కమిట్ మెంట్ అడిగారు.. హీరో సంచలన ఆరోపణలు..!
NQ Staff - January 31, 2023 / 09:09 AM IST

Ankit Gupta : దాదాపు సినిమా రంగంలోని అన్ని ఇండస్ట్రీలలో ఎప్పటి నుంచో ఓ సమస్య ఉంది. అదేంటంటే కాస్టింగ్ కౌచ్. చాలామంది పెద్ద స్టార్లు కూడా దాని బారిన పడ్డారు. ముఖ్యంగా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని వారికే ఇది ఎక్కువగా ఎదురయ్యే సమస్య. అయితే ఈ నడుమ స్టార్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వారికి కూడా ఇలాంటి సమస్యలు తప్పట్లేదు. మొన్నటికి మొన్న మంచు లక్ష్మీ కూడా స్పందించింది.
తనకు కూడా కాస్టింగ్ కౌచ్ ఎదురయినట్టు చెప్పింది. అయితే ఇన్ని రోజులు అమ్మాయిలకు మాత్రమే ఇలాంటి కాస్టింగ్ కౌచ్ ఎదురయింది అనుకుంటే పొరపాటే. ఇప్పుడు అబ్బాయిలు కూడా ఇలాంటి కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే అమ్రీష్‌పురి మనవడు తాను కూడా కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నట్టు చెప్పాడు.
తాజా ఇంటర్వ్యూలో..
ఇప్పుడు మరో బాలీవుడ్ నటుడు కూడా ఇలాంటి కామెంట్లు చేశాడు. సల్మాన్‌ఖాన్ హోస్ట్‌గా చేసిన బిగ్‌బాస్ 16 సీజన్ ద్వారా ఫేమస్ అయ్యాడు అంకిత్‌గుప్తా. ఆయన అంతకు ముందు సీరియల్స్ లో కూడా నటించాడు. అయితే ఈ క్రమంలోనే ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.
ఆయన మాట్లాడుతూ తాను కూడా కెరీర్ స్టార్టింగ్‌లో కాస్టింగ్ కౌచ్ బాధలు పడ్డట్టు తెలిపాడు. అవకాశం కోసం వెళ్తే అక్కడున్న ఓ వ్యక్తి నన్ను కాంప్రమైజ్ కావాలని చెప్పాడు. ఇప్పుడున్న పెద్ద స్టార్లు అందరూ ఇలా కమిట్ ఇంట్లు ఇచ్చారు కాబట్టి నువ్వు కూడా ఇవ్వాలంటూ నన్ను అసభ్యంతా తాకడం ప్రారంభించాడు. ఇలాంటివి తన వల్ల కాదంటూ అక్కడి నుంచి వచ్చేశాను అంటూ ఎమోషనల్ అయ్యాడు అంకిత్ గుప్తా.