Mahesh Babu : మెంటల్ మాస్ స్వాగ్.! ఏంటిది డైరెక్టరూ.!

NQ Staff - May 13, 2022 / 09:38 AM IST

Mahesh Babu : మెంటల్ మాస్ స్వాగ్.! ఏంటిది డైరెక్టరూ.!

Mahesh Babu : మాస్‌ని మెప్పించేందుకు సినీ జనాలు ఏవేవో చేస్తుంటారు. ‘సర్కారు వారి పాట’ సినిమాలో మహేష్ చేత మాట్లాడకూడని బూతులు మాట్లాడించేశారు. కొన్నింటిని మ్యూట్ చేశార్లెండి. ‘డాష్ తీరి పోయింది..’ అని అంటాడు మహేష్ ఓ సన్నివేశంలో. అది ట్రైలర్‌లోనే వివాదాస్పద మయ్యింది లెండి.

సరే, సినిమా అన్నాక మ్యాజిక్కులు తప్పవు. సినిమా ప్రమోషన్లలోనూ ఇలాంటి జిమ్మిక్కులు తప్పవు. ఆ సినిమాని పొగిడే క్రమంలో సోషల్ మీడియాలో సినీ ప్రముఖులూ తమ ట్వీట్లపై అదుపు కోల్పోతే ఎలా.?
‘మెంటల్ మాస్..’ అంటూ ‘సర్కారు వారి పాట’ సినిమా విషయమై పలువురు సినీ ప్రముఖులు ట్వీట్లేస్తున్నారు.

Anil Ravipudi Tweets On Mahesh Babu Performance

Anil Ravipudi Tweets On Mahesh Babu Performance

వీటిల్లో చాలావరకు కాపీ ట్వీట్లే. ఈ లిస్టులో ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి కూడా వున్నాడు. అనిల్ రావిపూడి గతంలో మహేష్‌ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
‘మెంటల్ మాస్..’ అంటూ ‘సర్కారు వారి పాట’ సినిమాలో మహేష్ చూపించిన ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్‌కి ఫిదా అవుతూ సోషల్ మీడియాలో ట్వీటేశాడు అనిల్ రావిపూడి. అది చూసి, అనిల్ పాలోవర్స్‌లో చాలామంది అవాక్కవుతున్నారు.

‘ఏంటి అనిల్ సార్ మీరు కూడా కాపీ ట్వీట్లేస్తారా.? ఆ మెంటల్ మాస్ ప్రస్తావన ఏంటి.? ఇది మీ స్థాయికి తగదు..’ అంటూ పలువురు నెటిజన్లు అనిల్ రావిపూడికి సూచిస్తున్నారు. అనిల్ ప్రస్తుతం తన తాజా సినిమా ‘ఎఫ్3’ ప్రమోషన్లలో బిజీగా వున్న సంగతి తెలిసిందే.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us