Anil Ravipudi And Mokshajna Teja : అనిల్ రావిపూడికి మోక్షజ్ఞ బాధ్యతని అప్పగించిన బాలకృష్ణ.?

NQ Staff - November 27, 2022 / 02:59 PM IST

Anil Ravipudi And Mokshajna Teja  : అనిల్ రావిపూడికి మోక్షజ్ఞ బాధ్యతని అప్పగించిన బాలకృష్ణ.?

Anil Ravipudi And Mokshajna Teja  : నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రమెప్పుడు.? అన్న ప్రశ్నకు సరైన సమాధానమైతే దొరకడంలేదు. ‘వచ్చే ఏడాది..’ అంటూ మోక్షజ్ఞ తెరంగేట్రంపై నందమూరి బాలకృష్ణ ముసిముసి నవ్వులు నవ్వుతూ చెప్పారు. కానీ, ఇది పరమ రొటీన్ సమాధానం. ఇందులో కొత్తదనం ఏమీ లేదు.

అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, మోక్షజ్ఞ తెరంగేట్రం కోసం నందమూరి బాలకృష్ణ గట్టిగానే ఆలోచన చేస్తున్నారట. అయితే, మోక్షజ్ఞ ఎప్పుడు తెరంగేట్రానికి సిద్ధమవుతాడన్నదానిపై మాత్రం స్పష్టత దొరకడంలేదు.

మోక్షజ్ఞదే ఆలస్యమంతా..

వెండితెరపై వెలిగేందుకు మోక్షజ్ఞ సన్నద్ధంగా లేడట. ఫిట్నెస్ మీద ఫోకస్ పెట్టాలి, డాన్సులు, నటనలో శిక్షణ తీసుకోవాలి. ఇలా చాలా పెద్ద కథే వుంది. సినిమా అంటే మాటలు కాదు. పైగా, నందమూరి బాలకృష్ణ నటవారసుడాయె.. అభిమానుల అంచనాల్ని అందుకోవాలంటే చాలా చాలా కష్టపడాలి.

కాగా, మోక్షజ్ఞ విషయంలో దర్శకుడు బోయపాటి కంటే, అనిల్ రావిపూడి స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ కథనం. ‘ఆదిత్య 999’ సినిమాని డీల్ చేసే విషయమై అనిల్ రావిపూడి, తనకున్న ఆలోచనల్ని ఇటీవల బాలకృష్ణతో పంచుకున్నాడని సమాచారం.

బాలయ్యతో ఓ సినిమా తెరకెక్కించనున్న అనిల్ రావిపూడి, ఆ తర్వాత మోక్షజ్ఞతో సినిమాని సెట్స్ మీదకు తీసుకెళతాడని సమాచారం.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us