Anil Ravipudi And Balakrishna : ఎన్‌బికె 108.. ఈసారి అంతకు మించి.!

NQ Staff - August 12, 2022 / 01:45 PM IST

Anil Ravipudi  And  Balakrishna : ఎన్‌బికె 108.. ఈసారి అంతకు మించి.!

Anil Ravipudi And Balakrishna : నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కున్న సంగతి తెలిసిందే. సినిమా స్క్రిప్ట్ పూర్తయ్యింది. త్వరలో సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతోంది కూడా.! ఈ మధ్యకాలంలో నందమూరి బాలకృష్ణ జోరు బాగా పెరిగింది. బహుశా ‘అఖండ’ సినిమా ఇచ్చిన ఊపు కారణం కావొచ్చు.

ఇంతకు ముందు నందమూరి బాలకృష్ణను ఎవరూ చూపించని కొత్త యాంగిల్‌లో తాను చూపించబోతున్నానని అనిల్ రావిపూడి గతంలోనే చెప్పాడు. తొలుత బాలయ్యతో సీరియస్ సినిమా చేయాలనుకున్నా, ‘ఎఫ్3’ చూశాక, కామెడీ కూడా కావాలని బాలయ్య చెప్పడంతో, స్క్రిప్టులో కొన్ని మార్పలు చేశారట.

అంతకు మించి..

Anil Ravipudi Said Going to Show Balakrishna in New Angle

Anil Ravipudi Said Going to Show Balakrishna in New Angle

‘అఖండ’ నందమూరి బాలకృష్ణ సినిమాలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రం. అంతకు మించిన బడ్జెట్టుతో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతోంది. ఈసారి మళ్ళీ అంతకు మించిన బడ్జెట్ అనిల్ రావిపూడి సినిమా కోసం ‘లాక్’ చేశారని తెలుస్తోంది.
ఈ సినిమాలో ‘పెళ్ళి సందడి’ ఫేం శ్రీలీల ఓ కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. సుమారు 100 కోట్ల దాకా బడ్జెట్ ఈ సినిమాకి పెట్టబోతున్నారన్నది తాజా ఖబర్. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా వుండబోతోందని అంటున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us