Anil RaviPudi : ఎఫ్ 4 విష‌యంలో అలా జ‌రిగితే, ఆడియ‌న్స్ రిసీవ్ చేసుకుంటారా..

NQ Staff - May 30, 2022 / 01:03 PM IST

Anil RaviPudi : ఎఫ్ 4 విష‌యంలో అలా జ‌రిగితే, ఆడియ‌న్స్ రిసీవ్ చేసుకుంటారా..

Anil RaviPudi : వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో అనీల్ రావిపూడి తెర‌కెక్కించిన ఎఫ్ 2 చిత్రం ప్రేక్ష‌కుల‌కి ఎంత పెద్ద వినోదం పంచిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ సినిమా మంచి విజ‌యం సాధించడంతో దీనికి సీక్వెల్‌గా ఎఫ్ 3 చిత్రం రూపొందింది. ఎప్పుడో విడుద‌ల కావ‌ల‌సిన ఈ చిత్రం ప‌లు కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డుతూ వ‌చ్చింది.చివ‌ర‌కు మే 27న మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చారు.

ఎఫ్ 3 కి పాజిటివ్ రెస్పాన్స్ దక్కిన నేపథ్యంలో ఎఫ్ 4 ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఎఫ్ 4 గురించి ఇప్పటికే పలు సార్లు దర్శకుడు అనీల్ రావిపూడి మరియు దిల్ రాజు లు కూడా స్పందించారు. హీరోలు అయిన వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ లు కూడా ఎఫ్ 4 ఉంటుందనే ఇటీవల ఇంటర్వ్యూల్లో పేర్కొన్నారు. వరుణ్ ఒక ఇంటర్వ్యూలో ఎఫ్ 4 కోసం రెండు మూడు స్టోరీ లైన్స్ ను కూడా దర్శకుడు అనిల్ రావిపూడి రెడీ చేశాడు అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు.

తాజాగా ఎఫ్ 4 గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎఫ్ 4 ఖచ్చితంగా ఉంటుంది కాని హీరోలు హీరోయిన్స్ వేరే ఉండవచ్చు అంటూ అనిల్ రావిపూడి టీమ్ మెంబర్స్ మరియు దిల్ రాజు కాంపౌండ్ కు చెందిన వారు ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నారు. ఎఫ్ 3 సినిమా నే వేరే నటీ నటులతో చేయాలనుకున్నాడు అనీల్ రావిపూడి. కాని ఎఫ్ 2 యొక్క మ్యాజిక్ మరియు ఫ్లేవర్ కంటిన్యూ అవ్వదనే ఉద్దేశ్యంతో మొత్తం వారినే దించాడు.

Anil RaviPudi is Hiring New Hero Heroines For F4

Anil RaviPudi is Hiring New Hero Heroines For F4

ఎఫ్ 2 లో నటించిన వారినే ఎఫ్ 3 లో నటింపజేయడం వల్ల భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చి నటింపజేయాల్సి వచ్చింది. అందుకే ఎఫ్ 4 చేస్తే వేరే హీరోలు హీరోయిన్స్ తో చేయడం బెటర్ అనే నిర్ణయానికి వచ్చాడట. అనిల్ రావిపూడి త్వరలో బాలకృష్ణ 108వ సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అవ్వొచ్చిందట.

ఇక ఎఫ్ 4 కు చాలా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఎఫ్ 4 కోసం ఇప్పటి నుండే ప్రేక్షకులు ఎదురు చూస్తున్నామని చెబుతున్నారు. ఎఫ్ 4 సినిమా ను ఇప్పుడు కాకున్నా ముందు ముందు అయినా అనిల్ రావిపూడి చేస్తాడని చాలా మంది ఎదురు చూస్తున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us